Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఇవాళ మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానన్న ఆయన.. కానీ లాభం లేకపోయిందని వ్యాఖ్యానించారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారం అన్నారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, తనది ఒంటరి పోరాటం అయిపోయిందన్నారు.
’’తోటి అర్చకులెవరూ వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకురాలేదు. దీంతో గత ఐదేళ్లూ నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది.
– నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు చూశాను. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు అందులో ఉంది. పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదు. తిరుమలను ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనికోసం ఎన్నో చర్యలు చేపట్టారు.
కర్ణాటకలోని నందిని డెయిరీ నుంచి నెయ్యిని వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. నెయ్యి కల్తీ పైన సరైన విచారణ చేయాలి. చర్యలు తీసుకోవాలి. ఇటువంటి విషయాలపై నేను గతంలో అధికారుల, ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్తే నాకు చెడ్డపేరు వచ్చింది నన్ను వాళ్లు హింసించారు. ఆ సమయంలో నాపై చట్టపరమైన కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారు. కోర్టుల చుట్టూ తిప్పారు… ఇంకా తిప్పుతున్నారు. వీటన్నిటిని గమనించి ముఖ్యమంత్రి సరిచేయాలి‘‘ అని రమణ దీక్షితులు కామెంట్స్ చేశారు.
Read also: Tirumala 7 Hills: తిరుమల ఏడు కొండల పేర్లు ఏమిటి? ఈ కొండలను ఎక్కడం వల్ల ఎలాంటి పుణ్యం కలుగుతుంది?
Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన ఈవో ధర్మారెడ్డి
Tirupati Laddu: తిరుపతి లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణం: వీహెచ్‌పీ
