HomeAndhra PradeshChandrababu Naidu: వైయస్ జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు

Chandrababu Naidu: వైయస్ జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు

Chandrababu Naidu: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై సీఎం చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. బుడమేరు గండి పడిన ప్రదేశాలను పరిశీలించిన చంద్రబాబు.. ఈ విధ్వంసానికి కారణం జగనేనంటూ కామెంట్ చేశారు. వ్యవస్థలు మొత్తం నాశనం అయ్యాయని, తాము సర్వ విధాలా ప్రయత్నాలు చేసి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు జగన్ ను ఉద్దేశించి ఏమన్నారంటే..

* బుడమేరులో 3 గండ్లు పడ్డాయి. గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.
* ఈరోజు ఈ గండ్ల వల్ల పెద్దఎత్తున ఈ ప్రాంతానికి నష్టం వచ్చింది.
* ఈ బుడమేరును కట్టడి చేయకపోతే ఆ వాటర్ విజయవాడమీద పడే పరిస్థితికి వచ్చింది.
* మొదటి రెండు రోజులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. అయోమయంలోకి వచ్చాం. ఎలా నియంత్రణ చేయాలో తెలియదు.

* దీనివల్ల మనం చూస్తే దుర్మార్గమైన కార్యక్రమం. ఒక వైపుప్రకృతి కన్నెర్ర చేసింది. చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి. కృష్ణా నదిలో 11లక్షల 43 వేల క్యూసెక్కులు నీళ్లు వచ్చాయి.
* అదే సమయంలో బుడమేరు పెద్దఎత్తున వచ్చింది. పక్కన ఉండే డ్రెయిన్స్ కూడా పొంగి వచ్చాయి. అన్నీ కలిసి ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేశాయి.
* మంత్రి నిమ్మల, ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ఇక్కడే ఉండి రాత్రి, పగలు పనిచేశారు. ఆర్మీ కూడా చేతులు ఎత్తేశారు.

* చాలా దిక్కుల మేము గండ్లు క్లోజ్ చేశాం కానీ ఈ గండి క్లోజ్ చేయడంలో మా దగ్గర తగిన టెక్నాలజీ లేదు. ధైర్యం చేసి ముందుకు పోయారు.
* డ్రోన్ లైవ్ ద్వారా గండ్లు పూడ్చివేత పనులు పర్యవేక్షించాం.
* ఐదేళ్లలో బుడమేరును అనేక చోట్ల కబ్జాలు చేశారు. తద్వారా నీళ్లు పోయే పరిస్థితి లేదు.
* ఐదేళ్లలో వ్యవస్థలను ఛిన్నా భిన్నం చేశారు.

* మేము సర్వ విధాలా ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్క ఇంటికి ఫుడ్ ప్యాకెట్లు పంపించాలని ఒక రోజున 10 లక్షల మందికి ఫుడ్ ప్యాకెట్లు పంపించి ఎన్నైనా పర్వాలేదు ఇవ్వాలని అన్నాము.
* బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ ను తెప్పించాం, డ్రోన్స్ పెట్టించాం, హెలికాప్టర్ లను తెప్పించాం.
* ఫుడ్ ప్యాకెట్లను ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేశాం. డ్రోన్స్ పెట్టించుకొని డ్రోన్స్ ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందజేశాం.

* ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరనుండే వ్యక్తులకి మేము సరిగా అందించ లేకపోయాం.
* ఒక దుర్మార్గుడి పాలనలో వీళ్లు చేసిన తప్పుడు పని వల్ల ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు వచ్చాయి.
* మనం నిలబడే బ్రిడ్జ్ కి ఐదేళ్లలో దారి కూడా వేయలేకపోయారు.
* కనీసం ఒక దారి కూడా వేయలేని వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం గుర్తుపెట్టుకోవాలి.

* అభివృద్ధి చేయకపోతే పర్వాలేదు వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి.
* వ్యవస్థలు భ్రష్టుపట్టడం వల్ల ఎవరూ పనిచేసే ధ్యాస లేదు నాకైతే రెండు, మూడు రోజులు అన్ని విధాలా అడ్మిన్ స్ట్రేషన్ ని ఫోర్స్ చేసిన మేము లాస్ట్ లో అనుకున్న లక్ష్యాలను నెరవేర్చ లేకపోయాం.
* ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు, కష్టపడుతున్నారు.

* వరద బాధితులకు సాయం చేసేందుకు అనేకమంది ముందుకొస్తున్నారు
* కొందరు ఆర్ధికసాయం చేస్తున్నారు. మరికొందరు ఆహారం సాయం చేస్తున్నారు
* కొందరు బట్టలు, ఇతర సామగ్రి సాయం చేస్తున్నారు
* ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు కానీ వైఎస్ఆర్ సీపీ మాత్రం విషం చిమ్ముతున్నారు
* వాళ్లు ఓడిపోయారు కాబట్టి ప్రజలమీద కక్ష తీర్చుకునే విధంగా పోతున్నారు
* ఏ మాత్రం సిగ్గుపడకుండా 3 బొట్లు వదిలిపెట్టారు ..ఒక్కొక్కటి 30 టన్నులు

* ఆ బోట్లు కౌంటర్ వెయిట్ ను గుద్దడం .. కాలమ్ ని గుద్ది ఉంటే కాలమ్ కుంగిపోయేది
* 15 మెట్రిక్ టన్నులు కౌంటర్ వెయిట్ రెండు గా అయ్యే పరిస్థితికి వచ్చింది
* సిగ్గు వదిలి సమర్ధించుకొంటున్నారు. మీరు మీ బొట్లను కరెక్ట్ గా పెట్టుకోకుంటే ఎందుకు తీసుకున్నారు
* బోట్లు మావి కావని అంటున్నారు ..మీ రంగులు ఎందుకు వేసుకున్నారు
* సమాధానం చెప్పాలి ..ఇలాంటి వాళ్లని మాములుగా ట్రీట్ చేస్తే లాభం లేదు. ఇది ఒక జాతి ద్రోహం ..విద్వేషం
* ఒక ప్రాజెక్ట్ ని దారుణంగా లెక్కలేనితనంగా ..ప్రకాశం బ్యారేజ్ ని నిర్లక్ష్యమే కాకుండా ,ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు
* 10రోజుల్లో ఇంత విపత్తుని కంట్రోల్ లోకి తీసుకొచ్చాం. వరదలపై యుద్ధం చేశాం

* ఎవరైతై విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి గండ్లను పూడ్చాం
* ఎక్కడో ఎక్కడో ఉండే బొట్లను ఎయిర్ లిఫ్ట్ చేశారు..ఎన్టీఆర్ ఎఫ్ ,సిబ్బంది అందరూ వచ్చారు. వాళ్ల సహకారంతో పనిచేసాం
* మళ్లీ తక్కువ ఉంటే రెండో రోజు ఎక్కువ తెప్పించాం
* ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజలను కొంతవరకు ఆదుకున్నాం
* ప్రాణ నష్టం తగ్గించాము, ఆస్తి నష్టాన్ని తగ్గించలేక పోయం

* ఒక పని కాకుండా ..ఇన్ వేటివ్ గా వెళ్లాం టెక్నాలజీ,మిషన్స్ ని ఉపయోగించం
* మనుషులందరినీ చైతన్య పరిచి ..వినూత్నంగా చేసి ..ఒక మాటలో చెప్పాలంటే యుద్దంలో గెలిచాం కానీ యుద్ధంలో మాత్రం జరిగిన నష్టం మాత్రం వెంటాడుతోంది
* వరదలపై యుద్ధం చేశాం. యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి ..సాయంత్రం 5 అయితే విరామం అది యుద్ధ ధర్మం. ..మళ్లీ సూర్యోదయం ప్రారంభం అయిన తర్వాత యుద్ధం స్టార్ట్ అవుతుంది

* రాత్రి పూట యుద్దంలో రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు
* నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు. ఆ ముసుగు తొలగిస్తా
* నేరస్తులు ముసుగు వేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు
* సిగ్గు లేకుండా 3 బోట్లను వదిలిపెట్టి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: Telangana: వరద బాధితుల కోసం సినీ నటి రూ.50 లక్షల విరాళం
Devara Trailer: దేవర ట్రైలర్ రిలీజ్.. కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ చింపేశాడ్రోయ్!
YS Jagan: రేపు గుంటూరులో వైయస్ జగన్ పర్యటన
Devara Trailer: దేవర ట్రైలర్.. సోషల్ మీడియా షేక్ అవ్వాలి.. చూసేందుకు రెడీనా?
Andhra Pradesh: నేరం ఏదైనా.. నిందితులు మాత్రం ఇరు పార్టీల్లో ఎలా ఉంటారు!?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు