Telangana: వరద బాధితుల సహాయార్థం ప్రముఖ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ఆమె ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు విరాళం చెక్కును అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నందుకు ఆమెను సీఎం అభినందించారు.
రేస్ క్లబ్ రూ.2 కోట్ల విరాళం
వరద బాధితుల సహాయార్థం హైదరాబాద్ రేస్ క్లబ్, ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్లను విరాళంగా అందజేసింది. రేస్ క్లబ్ డైరెక్టర్, లోక్‌సభ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, మరో డైరెక్టర్ నర్సింహారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిలను కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిని అభినందించారు.

Read also: CM Revanth Reddy: కమ్మ అంటే అమ్మ లాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on YS Jagan: జగన్‌కు మైలేజీ పెంచుతున్న రేవంత్‌రెడ్డి..
CM Revanth on Auto drivers: ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌రెడ్డి అభయం.. వారి కోసం ఏం చేస్తారంటే..
