HomeAndhra PradeshAmbati Rambabu: వైఫల్యాలు కప్పి పుచ్చడానికే బోట్ల పేరుతో చంద్రబాబు డ్రామా

Ambati Rambabu: వైఫల్యాలు కప్పి పుచ్చడానికే బోట్ల పేరుతో చంద్రబాబు డ్రామా

Ambati Rambabu: విజయవాడను ముంచెత్తిన వరదల్లో ముందు నుంచి చోటు చేసుకున్న వైఫల్యాలను కప్పి పుచ్చడానికే చంద్రబాబు ప్రభుత్వం బోట్ల డ్రామా ఆడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నిజానికి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీ కొట్టిన పడవలు టీడీపీ వారివే అన్నారు. అయినా వాటిని వైయస్సార్‌సీపీకి అంటగట్టడం దారుణమన్నారు.

చంద్రబాబు దారుణంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఈ వయసులో ఎందుకీ కుట్రలు, కుతంత్రాలు? అని ప్రశ్నించారు. చంద్రబాబు విజనరీ, అడ్మినిస్ట్రేషన్‌ ఏమైందని ప్రశ్నించారు. ఈ వరదల్లో ప్రజల ప్రాణాలు ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై నంబూరి శంకరరావుపై మంగళవారం జరిగిన దాడి దుర్మార్గమన్న అంబటి, రాష్ట్రంలో యథేచ్ఛగా అధికార పార్టీ దురాగతం సాగుతోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో అసలు శాంతి భధ్రతలు ఉన్నాయా? అని గట్టిగా నిలదీశారు.

ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలన్న చంద్రబాబు, విజయవాడ వరదల సంక్షోభంతో వైయస్సార్‌సీపీ నాయకులపై కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ను మూడు పడవలు ఢీకొట్టడంతో బ్యారేజ్‌ కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడిందని, దీనికి వైఎస్‌ఆర్‌సీపీ కారణం అని, ఇది ఒక కుట్ర అని చంద్రబాబు, మంత్రులంతా చెప్పడం, దానికి ఎల్లో మీడియా వంత పాడడం దారుణమన్నారు. దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఈ మధ్యకాలంలో ఎన్నడూ రాలేదని, ఆ వరద ఉధృతికి పైనుంచి అనేక పడవలు కొట్టుకొచ్చాయని, వాటిలో టూరిజమ్‌ బోట్లు కూడా ఉన్నాయని తెలిపారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ వరదల వల్ల 202 పడవలు పాక్షికంగా, 432 పడవలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కొన్ని వందల చిన్న బోట్లు బ్యారేజ్‌ గేట్ల మధ్య నుంచి కొట్టుకుపోయాయని చెప్పారు. ఈ కేసులో కోమటి రామ్మోహన్, ఉషాద్రిని అరెస్ట్‌ చేశారన్న ఆయన.. కోమటి రామ్మోహన్‌ టీడీపీ ఎన్నారై వింగ్‌ హెడ్‌ కోమటి జయరామ్‌కు సమీప బంధువని, ఉషాద్రి కూడా లోకేష్‌తో ఫోటో దిగారని గుర్తు చేశారు.

ఆ ఘటనను వైయస్సార్‌సీపీకి అంటగడుతూ, తమ పార్టీ నాయకులు.. మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ను టార్గెట్‌ చేశారని అంబటి రాంబాబు ఆక్షేపించారు. తాము ప్రకాశం బ్యారేజ్‌ కూల్చే కుట్ర చేశామనడం దుర్మార్గమన్న ఆయన, ఇంత దారుణమైన మాటలు ఎందుకని? కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. వీటన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని కోరారు. అధికార పార్టీకి అసెంబ్లీ, లోక్‌సభలో తగిన మెజారిటీ ఉన్నా, ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారని ప్రశ్నించారు.

‘చంద్రబాబు అంతగా ఎందుకు భయపడుతున్నారంటే.. జగన్‌ వెనకున్న 40 శాతం ఓట్లు. ఇంకా కూటమి గెలుపు వారిది కాదన్న భయం. అందుకే జగన్‌ ను ఏదో ఒక విధంగా అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు’.. అని అంబటి రాంబాబు చెప్పారు. ఏ పడవలకైనా నీలి, పసుపు రంగులే ఉంటాయన్న ఆయన, కావాలంటే ఏ పోర్టుకైనా వెళ్లి చూడాలని హితవు చెప్పారు.

ఇవీ చదవండి: Ambani: అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ బాష్‌.. బాలీవుడ్‌ తారలంతా అక్కడే ఉన్నారుగా…!
Ambati Rambabu: జగన్‌ దెబ్బకు తట్టుకునే శక్తి టీడీపీకి లేదు: మంత్రి అంబటి రాంబాబు
Ambati on pawan: వారాహి ఎక్కి పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు: మంత్రి అంబటి
Ambati Rambabu fire on CBN: వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు: అంబటి రాంబాబు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు