Meena: టాలీవుడ్ ఇండస్ట్రీలోని నటులపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్న యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకున్నందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణుకు సీనియర్ హీరోయిన్ మీనా అభినందనలు తెలిపారు. హీరోహీరోయిన్లపై ట్రోలింగ్, అసత్య ప్రచారాలతో విమర్శలు చేస్తున్న సదరు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను హెచ్చరిస్తూ ఆయా వీడియోలను, కామెంట్లను 48 గంటల్లోగా తొలగించాలని మంచు విష్ణు సూచించారు.
మంచు విష్ణు నిర్ణయంపై నటి మీనా రియాక్ట్ అయ్యారు. మంచు విష్ణుకు (Manchu Vishnu) ధన్యవాదాలు చెబుతూ ఇన్‌స్టాలో మీనా పోస్ట్ పెట్టారు. ’మా’ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పోస్ట్‌ను ఆమె షేర్ చేశారు. (Meena) ‘తప్పుడు కంటెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్ చానళ్లపై యాక్షన్ తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు, అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ సమగ్రతను కాపాడటంలో మీరు చూపుతోన్న అంకితభావం నిజంగా అభినందనీయం.
నటీనటులు ఈ విషయంలో ఎన్నో ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెగెటివ్ కామెంట్స్‌ను ఎదిరించడంలో, మన సంఘాన్ని కాపాడడంలో అందరం కలిసి ముందుకు వెళ్లాలి. ఈ విషయంలో మీరు నిరంతరం మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను. మంచు విష్ణు.. చాలా మంచి పనిచేశారు’ అని పేర్కొన్నారు.
గతంలో మీనా వ్యక్తిగత విషయాలపై కొన్ని యూట్యూబ్ చానళ్లు ఇష్టానుసారంగా వార్తలు రాశాయి. వీటిపై అప్పట్లో నొచ్చుకున్న మీనా.. స్వయంగా వివరణ ఇచ్చారు. వాటిని ఖండిస్తూ ఇలాంటివి రాయడం సమాజానికి, వ్యక్తుల ప్రతిష్టకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: Tripti Dimri: బాలీవుడ్‌లో ఎంత మంది అందగత్తెలున్నా.. త్రిప్తి డిమ్రీ అందం వేరయా!
Rashi Singh: రాశి సింగ్ హాట్ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్ పిక్స్!!
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఫొటో గ్యాలరీ
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్ షో.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వైరల్
Palak Tiwari: పాలరాతి శిల్పం.. పాలక్ తివారి ఫొటో గ్యాలరీ..
