HomeTelanganaSoftware Employees: రోజుకు 16 గంటల పని.. సాఫ్ట్ వేర్ పిల్లల నడుములు వంగిపోతున్నాయ్..

Software Employees: రోజుకు 16 గంటల పని.. సాఫ్ట్ వేర్ పిల్లల నడుములు వంగిపోతున్నాయ్..

Software Employees: చట్టసభల్లో ఎక్కువ సమయం రాజకీయంగా కొట్లాడుకోవడం, పరస్పరం మాటలు మార్చుకోవడం చూస్తుంటాం. ప్రజా ప్రయోజనాలపై చర్చలు జరగడం కాస్త తక్కువగానే జరుగుతుంటుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు… ఇలా అనేక రంగాలపై, సమస్యలు, పరిష్కారాలపై చర్చలకు సమయం చాలా తక్కువగానే కేటాయిస్తుంటారు. కానీ, మెజార్టీ వర్గాలు ప్రభావితం అయ్యే అంశాలను ప్రస్తావించి, వాటికి పరిష్కారాలపై చర్చలు జరిగినప్పుడు అలాంటి వార్తలు వైరల్ అవుతుంటాయి. ఈ కోవలోనే తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఓ కొత్త అంశంపై సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ప్రస్తావించి మాట్లాడారు. అదే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కష్టాలు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులంటే చాలా మంది బయట ప్రపంచంలో ఏమనుకుంటారు? వాళ్లకేం.. లక్షల రూపాయల జీతాలు అందుకుని వీకెండ్స్ పార్టీలు, ఔట్ డోర్ పార్టీలు, క్లైంట్ మీటింగులు, ఆన్ సైట్.. ఇలా ఎన్నో ఉంటాయని భావిస్తారు. కానీ వాళ్ల జీవితాల్లో ఉండే చీకటి బతుకులు తెలిసిన వారు చాలా తక్కువ. ఈ అంశంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గురించి కూనంనేని ఏమన్నారంటే..

’’సాప్ట్ వేర్ బాగుంటుందని, అక్కడ పని చేసే పిల్లలు అదృష్టవంతులు అని మనం అనుకుంటాం. కానీ వాళ్లు చూస్తున్నంత నరకం.. నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. రోజుకు 14 గంటలు, 16 గంటలు పని చేస్తుంటారు. వాళ్లపై నియంత్రణ లేకపోతే సాఫ్ట్ వేర్ రంగంలో ఉండేవారి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. కేవలం ఆ కంపెనీలకు, గవర్నమెంట్ కు డబ్బులు వస్తాయి, పిల్లలకు కూడా కొద్ది రోజులే జీతాలు వస్తాయి. తర్వాత వారి నడుములు వంగిపోతాయి. చేయలేరు. బయటకొచ్చి మరో పని చేయలేని దుస్థితి. దీనిపై ఒక సిస్టమ్ పెట్టి, నియంత్రణ చేయకపోతే చాలా కష్టం. పైన మెరుగులు చూసి మురిసిపోవడం తప్ప, లోపల పరిస్థితులు అర్థం చేసుకోలేకపోతున్నాం.’’ అని కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రస్తావించారు.

చాలా ఏళ్లుగా తమ బాధల గురించి ఎవరూ పట్టించుకోలేదని, మొదటిసారి అసెంబ్లీలో తమ గురించి ఓ ఎమ్మెల్యే ప్రస్తావించి తమ కష్టాల గురించి బాహ్య ప్రపంచానికి చెప్పడం చాలా ఆనందంగా ఉందంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి: Meena: ఆ నిర్ణయం అభినందనీయం: నటి మీనా
PhonePe: ఫోన్ పేలో రిఫరల్ ప్రోగ్రామ్ గురించి తెలుసా?
AP Govt Schemes: సంక్షేమ పథకాలు ఆపేయడం కూడా మంచిదేనా?!
The Raja Saab: రాజా సాబ్ గ్లింప్స్.. డార్లింగ్ ప్రభాస్ లుక్ అదిరిందిగా..!
Amazon Fresh: ఇండియాలో అమెజాన్ ఫ్రెష్ జోష్.. 130కి పైగా పట్టణాల్లో విస్తరణ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు