Eating: ఆహారం ఏ వయసులో వారు ఎలా తినాలి? అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంటుంది. చిన్నారులు, యుక్తవయసు పిల్లలు, వయసులో ఉన్న వారు, కాస్త పెద్ద వయసు వచ్చిన వారు, ముసలి వారు.. ఇలా అన్ని దశల్లో ఆహారం అనేది జీవితంలో ఒక కీలకమైన అంశం. ఎలాంటి ఆహారం తీసుకుంటే వయసు అయిపోయిన సందర్భాల్లోనూ అనారోగ్యానికి గురి కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్న అంశాలు అందరూ తెలుసుకోవాలి.
’’ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్..’’ అన్నారు ప్రముఖ కవి గురజాడ అప్పారావు. ’’తిండి కలిగితె కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్..’’ అని కూడా మనం చదువుకున్నాం. పురాతన కాలం నుంచే మన ఇళ్లలో నెయ్యి ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా కొందరికి నెయ్యి లేనిదే ముద్ద దిగదు అంటే ఆశ్చర్యం అవసరం లేదు. సాధారణంగా మన ఇళ్లలో చేసుకునే పప్పు మొదలు రసం, సాంబార్, ఇతర కూరలు, చికెన్, మటన్, బిర్యానీ సహా అన్నింటిలో నెయ్యి పడితే ఆ టేస్టే వేరు. (Meals)
నెయ్యి తింటే లావైపోతారు, ఫ్యాట్ వస్తుందన్న మాటలు పట్టింపులకు పోకుండా శుభ్రంగా కడుపు నిండా లాగించేయాలని సూచిస్తున్నారు పెద్దలు. మనం బలం కావాలంటే బాగా తినాలి. ఇంతకీ ఏ వయసు వారు ఎలా తినాలో పెద్దలు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
10-30 ఏళ్ల వయసు గల పిల్లలు
ఈ వయసులో ఉన్న పిల్లలు డైటింగ్ లాంటివి పక్కన పెట్టి ఫుల్ గా ఫుడ్ లాగించేయాలి. నెయ్యిని బాగా వేసుకుని తినాలి. పాలు, పెరుగు, వెన్న, మీగడ, నెయ్యి.. ఇవన్నీ తప్పక మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
30-40 ఏళ్ల వయసు వారు
పాలు, పాల పదార్థాలను కాస్త తగ్గించి తీసుకోవాలి. మసాలాలు లాంటి వాటిని అదే మొత్తంలో తక్కువ స్థాయిలో తీసుకోవాలి.
50 ఏళ్లు పైబడిన వారు
ఈ వయసుకు వచ్చిన వారు నెయ్యిని పూర్తిగా తగ్గించేయాలి. ఇంకా తినాలనిపిస్తే జస్ట్ ఒక బొట్టు రూపంలో అన్నంలో నెయ్యిని భాగం చేసుకోవచ్చు. అంతేగానీ స్పూన్లు స్పూన్లు వేసుకుని లాగించేయడం వల్ల జీర్ణం కాక అనారోగ్యానికి గురి కావాల్సి ఉంటుంది.
60 ఏళ్లు దాటిన తర్వాత
ఇక వృద్ధాప్య దశ వచ్చిన తర్వాత అంటే 60 ఏళ్లు దాటాక నాలుకకు రుచి అనిపించేవన్నీ తినాలని కోరుకోరాదు. మితాహారం తీసుకోవడం, రెస్టు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అయితే, నిత్యం వ్యాయామం చేస్తూ లేదా జిమ్ చేస్తూ ఫిట్ గా ఉన్న వారు ఇందుకు మినహాయింపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి శరీరం ఏది తిన్నా అరిగించుకుని, క్యాలరీస్ కరిగించే శక్తి ఉంటుంది. అప్పటికీ ఆహార జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. కాబట్టి.. వయసులో ఉన్నప్పుడు రాళ్లు తిని అయినా అరిగించుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కడుపునిండా తినండి. వ్యాయామాలు చేస్తూ దృఢంగా తయారు కండి మరి.
ఇవీ చదవండి: Women Food: 30 ఏళ్ల మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
Parenting: పిల్లలు ఆహారం తినకుండా మారాం చేస్తే ఏం చేయాలి?
Eye health: కంటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
Kakara Kaya: చేదైన ఆహారం.. పోషక గుణాల్లో తియ్యదనం.. కాకర కాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవీ..
Cluster Beans: గోరుచిక్కుడుతో అద్భుత ప్రయోజనాలు.. కండరాల ఎదుగుదలకు చక్కటి ఆహారం
