Tea: చాలా మందికి భోజనం తిన్న తర్వాత టీ తాగడం అలవాటుగా ఉంటుంది. లేదా కాఫీ తాగుతుంటారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత అయితే చాలా మంది రొటీన్ గా టీ తాగుతారు. అయితే, మన శరీరానికి హాని చేసే టీ, కాఫీలు.. భోజనం తినడానికి ముందు, ఆ తర్వాత తీసుకుంటే చాలా నష్టాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసోర్సెస్ (ఐసీఎంఆర్) మార్గదర్శకాల ప్రకారం.. టీ, కాఫీలను తీసుకోవడంపై కీలక విషయాలు వెల్లడయ్యాయి. భారతీయుల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ఆసక్తిని పెంచేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో ఐసీఎంఆర్ తాజాగా 17 కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. టీ, కాఫీ తాగే అలవాట్లలో మార్పులను ఇవి క్లియర్ గా తెలియజేస్తున్నాయి.
టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. రోజుకు 300 mg కంటే ఎక్కువ కెఫిన్ శరీరంలోకి వెళ్లకూడదని ఐసీఎంఆర్ మార్గర్శకాలు చెబుతున్నాయి. అలాగే, టీ , కాఫీలో టానిన్లు ఉంటాయి. ఇవి ఇనుమును గ్రహించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందుకే ఐసీఎంఆర్ మార్గదర్శకాలు కూడా భోజనానికి ముందు, ఆ తర్వాత కనీసం 1 గంట పాటు టీ లేదా కాఫీని సేవించకూడదని చెబుతున్నాయి.
ఇలా చేయడం వల్ల రక్తహీనతకు దారి తీస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కూడా అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. అయితే, ఆ మార్గదర్శకాల్లో పాలు లేకుండా టీ తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుందని పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. కంటి సమస్యలు, పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కు ఎలా అప్లయ్ చేయాలి?
Parenting: టీనేజ్ పిల్లల పేరెంటింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Chickpea: శనగలు నానబెట్టి ఇలా తీసుకుంటే ప్రోటీన్స్ మీ సొంతం!
Healthy Snacks: హెల్తీ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలి.. ఇది మీకోసమే..!
Right to Abortion: ఆ దేశంలో అబార్షన్ హక్కు.. రాజ్యాంగంలో మార్పులు!
