HomeInternational256 KM Straight Road: సౌదీలో అద్భుతమైన రహదారి.. ఒక్క మలుపూ లేకుండా 256 కి.మీ....

256 KM Straight Road: సౌదీలో అద్భుతమైన రహదారి.. ఒక్క మలుపూ లేకుండా 256 కి.మీ. హైవే

256 KM Straight Road: మనదేశంలో జాతీయ రహదారులు చాలా వరకు మలుపులతో కూడి ఉంటాయి. చాలా దేశాల్లోనూ ఇదే రకంగా కొండలు, గుట్టలను దాటుకుని, మలుపులతో జాతీయ రహదారులు నిర్మాణం చేస్తారు. కానీ సౌదీ అరేబియా దేశంలో మాత్రం అద్భుతమైన రహదారిని నిర్మించారు. సౌదీ అరేబియాలో ఏకంగా 256 కిలోమీటర్ల మేర మలుపులు లేని హైవే ఉంది.

ఈ రహదారిని రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా వేశారు. హైవే 10లో ఏకంగా 256 కిలోమీటర్ల దూరం వరకు ఒక్క మలుపు కూడా ఉండదు. హరద్ నుంచి యూఏఈ సరిహద్దు ప్రాంతం అల్బతా వరకు ఎక్కడ కూడా మలుపులు లేవని అరబ్ కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇప్పటివరకు మలుపులు లేని అతి పెద్ద రహదారి ఆస్ట్రేలియాలోని ఐర్ హైవే (146 కి.మీ.) ఉండేది. ఇప్పుడు దాని రికార్డును హైవే 10 బద్దలు కొట్టినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి.

సౌదీ రాజు అబ్దుల్లా కోసం మొదట దీన్ని ప్రైవేటు రోడ్డుగా ప్రత్యేకంగా నిర్మించుకున్నారట. ఇప్పుడు చమురు రవాణాకు వినియోగిస్తున్నారు. ఈ రహదారి నిటారుగా ఉండటమే కాదు.. ఎక్కడా కూడా ఎత్తుపల్లాలు కూడా ఉండవని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వెల్లడించింది. ఈ దారి వెంట ఎక్కడా ఒక్క చెట్టు, నిర్మాణాలు కూడా ఉండవట. ఈ రోడ్డుపై వెళ్లే వాహనాలు కేవలం 2 గంటల్లోనే 256 కి.మీ దూరం ప్రయాణించేస్తాయి. కానీ అప్పుడప్పుడు ఒంటెలు, కంగారూలు రోడ్డు దాటుతుంటాయట. వాహనదారులు ఈ మేరకు జాగ్రత్తగా నడపాలని http://www.dangerousroads.org అనే వెబ్సైట్ సూచిస్తోంది.

Read also: Roads: రోడ్లపై గుంతలా? దానంతట అదే పూడుకుపోయే టెక్నాలజీ వచ్చేస్తోంది!
Long Drive: Long drive road trip plans for international tourists
Darsi Road Accident : దర్శి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాగర్‌ కెనాల్‌లోకి పెళ్లి బస్సు.. ఏడుగురు దుర్మరణం
Belt: టైటుగా ఉండే బెల్ట్‌తో అనారోగ్య సమస్యలు ఖాయం..!
Phone beside Bed: బెడ్‌ పక్కన ఫోన్‌ పెట్టుకుని పడుకుంటే ఎన్ని అనర్థాలో తెలుసా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు