ఇంట్లో సినిమా చూస్తున్నప్పుడు దాదాపు రెండు లేదా మూడు గంటల పాటు బోర్ కొడుతోందా? సాయంత్రం వేళ హెల్తీ స్నాక్స్ (Healthy Snacks) కోసం ప్రయత్నించి అలసిపోయారా? ఈవెనింగ్ టైమ్ నోటికి పని చెప్పాలా? అయితే కొన్ని రకాల స్నాక్స్ తింటే సినిమాను ఎంజాయ్ చేయడంతో పాటు కడుపు నిండా హెల్తీ స్నాక్స్ (Healthy Snacks) తిన్నట్లు అవుతుంది. ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటే ఒంటికి బలం కూడా చేకూరుతుంది. మూడ్ ఉత్సాహంగా కొనసాగుతుంది. సాధారణంగా హాలిడేస్ లేదా వీకెండ్స్ లో మూవీలు చూడటానికి సమయం కేటాయిస్తుంటారు. ఈ సమయాల్లో ఇంట్లో కూర్చోవడం కంటే సినిమా చూస్తూ కాలక్షేపం చేద్దాం అనుకుంటారు.
1. ఇలాంటి సమయంలో ఇష్టమైన స్నాక్స్ పక్కనుంటే సినిమాను బాగా ఆస్వాదించవచ్చు. తర్వాత చాలా సేపు నిద్రపోవడానికి కూడా ఈ స్నాక్ ఉపయోగపడుతుంది.
2. కరోనా వచ్చాక థియేటర్ కి వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య తగ్గిందనే చెప్పొచ్చు. ఓటీటీ ప్లాట్ ఫాం వచ్చాక ఇంట్లోనే సినిమాలు చూడ్డం మొదలు పెట్టారు జనాలు.
3. ఆన్ లైన్, ఓటీటీ అంటూ వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇంట్లో హోం థియేటర్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సమయాల్లో చిరుతిండి ఓ చేత్తో, రిమోట్ మరో చేత్తో పట్టుకోవడం సర్వ సాధారణం అయ్యింది.
4. సినిమా చూస్తూ ఇంట్లో కూర్చున్న సమయాల్లో ఓ గిన్నె నిండా లోటస్ ట్రాప్ లేదా గింజలు పెట్టుకొని కూర్చుంటే హాయిగా ఉంటుంది.
5. ఈ తిండిలో పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు నిండి ఉంటాయి. తామర గింజలను ఉడకబెట్టి లేదా నెయ్యిలో వేయించి, సుగంధ ద్రవ్యాలు చల్లి తింటే ఇక స్వర్గమే.
6. పాప్ కార్న్ కూడా ముఖ్యమైనదే. సాధారణంగా థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు కూడా పాప్ కార్న్ ఎక్కువగా ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు.
7. తీపి, లేదా మసాలా చిరుతిండి గుర్తుకు వస్తుంది. ఇది ఆరోగ్యకరం కాదని చెబుతారు. అయితే, ఉప్పు లేదా పాప్ చేసిన పాప్ కార్న్ ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు.
8. వెజిటబుల్ స్టిక్స్ కూడా తినొచ్చు. క్యారెట్, దోసకాయ, వెజిటబుల్ చిప్స్ ట్రై చేయవచ్చు. ఇవిగాకుండా చిక్ పీస్ ను ఇంట్లోనే తయారు చేసుకొని ప్రయత్నించొచ్చు.
అధిక బరువుతో బాధపడుతున్నారా? ఇవి తింటే వెంటనే బరువు తగ్గుతారు
1. మనలో చాలా మందిని అధిక బరువు సమస్య వేధిస్తుంటుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తోడ్పడతాయి.
2. అలాంటి వాటికి దూరంగా ఉంటే బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. జీవన శైలిలో మార్పులు కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి.
3. బరువు పెరిగితే గుండె జబ్బులు వచ్చే ఆస్కారం అధికంగా ఉంటుంది. మధుమేహం లాంటి దీర్ఘకాలిక రోగాలు సోకే చాన్స్ ఉంది.
4. ఇలాంటి సమస్యలను దూరంగా పెట్టేయాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. తీసుకొనే ఆహార పదార్థాలపై కాస్త శ్రద్ధ వహించాలి.
5. మనం తీసుకొనే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు వీలైంత వరకు రోజూ వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి.
6. క్రమం తప్పకుండా వైద్యుల సూచనలు పాటిస్తుండాలి. డైట్ ఫాలో కావాలి. కాస్త కష్టమైనా ఇది తప్పదు. ఉన్నంతలో పోషకాహారం తీసుకోవడాని ప్రయత్నించాలి.
7. కొందరు విపరీతంగా మెడిసిన్స్ వాడుతుంటారు. ఇవి ప్రమాదకరం. ఇంకా బరువు సమస్య పెరగడానికి చాన్స్ ఉంటుంది. ఇలాంటివి చేయరాదు.
8. రోజూ ఉడికించిన గుడ్డు తినాలి. గుడ్డులో పోషక విలువులు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ అందుతాయి. బ్రేక్ ఫాస్ట్ గా వీటిని తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు.
9. తద్వారా బరువు కూడా పెరగకుండా చేసుకోవచ్చని అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ న్యూట్రిషనల్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురితమైన పరిశోధన పేర్కొంది.
10. ఊబకాయంతో బాధపడేవారు రోజూ మూడు గుడ్లు తీసుకోవాలట. కొవ్వు 16 శాతం వరకు తగ్గుతుందని తేలింది.
11. గుడ్లతో పాటు గ్రీన్ టీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో ఎపిగాల్లోకాటెచిన్ గాలేట్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీని వల్ల బాడీలో కొవ్వు కరిగించే శక్తి వస్తుంది.
12. అలాగే మిరపలో కొవ్వును కరిగించే శక్తి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో క్యాప్సైసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఆహార పదార్థాల్లో కారం పొడిని వాడితే శరీరానికి తగినంత క్యాప్సైసిస్ అందుతుంది.
Read Also : Weight Loss Drinks: బరువు తగ్గాలంటే ఏ డ్రింక్స్ తాగాలి? బెస్ట్ హెల్త్ టిప్స్ ఇవే..