HomeLife StyleInteresting facts: మీకు తెలుసా? మాంసాహారం కంటే శాకాహారం ధరే పెరిగిందట!

Interesting facts: మీకు తెలుసా? మాంసాహారం కంటే శాకాహారం ధరే పెరిగిందట!

Interesting facts: వారానికోసారి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగని వారు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. మాంసాహారం కంటే శాకాహారం ధర రోజురోజుకూ ఇప్పుడు ప్రియ అవుతోంది. అదే సమయంలో నాన్‌ వెజ్‌ రకాల ధర తగ్గుతోంది. ఏప్రిల్‌ నెలలో వెజిటేరియన్‌ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరగ్గా.. మాంసాహార థాలీ ధర తగ్గింది. క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ అనాలసిస్‌ ఇటీవల వెలువరించిన ‘రోటీ రైస్‌ రేట్‌’ నివేదికలో ఈ విషయం బహిర్గతమైంది.

రోటీ, కూరగాయలు (టమటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు), అన్నం, పప్పు, పెరుగు, సలాడ్‌తో కూడిన వెజ్‌ థాలీ సగటు ధర గతేడాది (2023) ఏప్రిల్‌లో రూ.25.4 ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.27.4కు చేరింది. ఈ ఏడాది మార్చి నాటి రూ.27.3తో పోల్చినా స్వల్పంగా పెరుగుదల నమోదైంది. అదే నాన్‌-వెజ్‌ థాలీలో పప్పు స్థానంలో చికెన్‌ ఉంటుంది. 2023 ఏప్రిల్‌లో సగటు ధర రూ.58.9 ఉండగా, గత నెలలో రూ.56.3 ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ధర రూ.54.9తో పోలిస్తే మాత్రం ఏప్రిల్‌లో ధర పెరిగింది.

వెజ్ థాలీకి ఖర్చు ఎక్కువే..
సాధారణంగా థాలీని తయారు చేయడానికి వినియోగించే సరుకుల ధరల సగటు ఆధారంగా దానికయ్యే ఖర్చును నిర్ణయిస్తారు. దాని ఆధారంగా సామాన్యుడిపై ఎంత భారం అవుతోంది అన్నది అంచనా కడతారు. అయితే, వెజ్‌ థాలీలో వినియోగించే ఉల్లిపాయల ధర 41%, టమాటాలు 40 శాతం, బంగాళాదుంపలు 38 శాతం, బియ్యం 14 శాతం, పప్పులు 20 శాతం గతంతో పోలిస్తే ధరలు పెరిగాయి. జీలకర్ర, మిరప, వంటనూనెల ధర వరుసగా 40 శాతం, 31 శాతం, 10 శాతం తగ్గాయి. దీనివల్ల వెజ్‌ థాలీ ధర మరీ అంత ఎక్కువేం పెరగలేదు.

నాన్‌ వెజ్‌ థాలీ మాటకు వస్తే దీని ధరలో 50% వెయిటేజీ బ్రాయిలర్‌దే. వార్షిక ప్రాతిపదికన బ్రాయిలర్‌ ధర 12 శాతం తగ్గడంతో నాన్‌-వెజ్‌ థాలీ ధర తగ్గింది. ఈ మధ్య కాలంలో బ్రాయిలర్‌ ధర 4 శాతం పెరగడంతో ఈ ఏడాది మార్చి కంటే ఏప్రిల్‌లో నాన్‌వెజ్‌ థాలీ ధర 3 శాతం పెరిగిందని నివేదికలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే వెజ్‌- థాలీ ధర పెరగ్గా.. నాన్‌ వెజ్‌- థాలీ తగ్గింది. బ్రాయిలర్‌ ధర తగ్గడం కారణంగా నాన్‌ వెజ్‌ తగ్గగా.. ఉల్లిపాయలు, దుంపలు, టమాటా ధరలు ఊపందుకున్నాయి. భవిష్యత్‌లో కూరగాయల ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read also: Non Veg: మాంసం తినడం వల్ల ఎలాంటి ప్రోటీన్లు లభిస్తాయి? ఏయే విటమిన్లు పొందవచ్చు?
Best Veg Food: శాకాహారంలో బెస్ట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ ఏవి? మంచి ప్రోటీన్స్‌ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
Veg Food: శాకాహారంలోనూ మాంసంతో ఈక్వల్‌గా బలం.. ఈ ఫుడ్‌ విశేషాలు తెలుసుకోండి!
Non Veg: మాంసాహారం ఏ రోజుల్లో తినాలి? మంగళవారం తింటే ఏం జరుగుతుంది?
Tortoise: షాకింగ్‌.. తాబేలు మాంసం ఆహారంగా తీసుకుంటారా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు