SADAREM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు లోపాలున్న వ్యక్తులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. తద్వారా ప్రభుత్వం నుంచి పలు రాయితీలు, ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుంది. అసలు సదరం సర్టిఫికెట్ ఎలా పొందాలి? ఎక్కడ పొందాలి? సదరం సర్టిఫికెట్ అంటే ఏమిటి? స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి? ఏయే డాక్యుమెంట్లు అవసరం అవుతాయి? ఎలాంటి లోపాలు ఉన్న వారికి ఈ సర్టిఫికెట్లు ఇస్తారు? తాజాగా విడుదలైన షెడ్యూల్ ఏమిటి? తదితర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సదరం స్లాట్ బుకింగ్ ఖరారు
సదరం ధ్రువపత్రాలు పొందడం కోసం 2024 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన అడ్వాన్సుడు స్లాట్ కోసం ఈనెల 8వ తేదీ నుంచి గ్రామ/ వార్డు సచివాలయాల్లో, మీసేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి.
ఏమిటీ సదరం సర్టిఫికెట్?
ఓ వ్యక్తి శారీరక, మానసిక లోపాలు కానీ, కంటికి సంబంధించిన ఇబ్బందులు, లేదా మరే ఇతర లోపంతో బాధపడుతున్నా సరే.. అలాంటి వారికి లోపాన్ని నిర్ధారణ చేస్తూ ఇచ్చే ధ్రువీకరణ పత్రమే సదరం సర్టిఫికెట్. (What is SADAREM Certificate) అయితే వీటిని ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని ఆస్పత్రుల్లోనే జారీ చేస్తారు.
ఈ సదరం సర్టిఫికెట్ ఎలా పొందాలి?
సదరం ధ్రువపత్రం పొందాలనుకున్న వారు (How To Get SADAREM Certificate) సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయానికి గానీ, మీసేవా కేంద్రానికి గానీ వెళ్లాలి. అక్కడ సిబ్బందిని అడిగి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవడం అంటే ప్రభుత్వం రాబోయే నెలల్లో ఏయే తేదీల్లో సదరం ధ్రువపత్రాలు జారీ చేస్తుందో ముందే తెలియజేస్తూ ప్రకటన ఇస్తుంది. దాని ప్రకారం మీ వివరాలతో పాటు ఆన్ లైన్ లో మీకు చూపించిన ఆస్పత్రుల్లో మీకు దగ్గరగా ఉన్న ఆస్పత్రిని సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం మీకు ఒక తేదీని, సమయాన్ని కేటాయిస్తారు. దీన్ని స్లాట్ బుకింగ్ అంటారు. మీకు కేటాయించిన తేదీ, సమయానికి కచ్చితంగా సదరు ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతా మీకు సదరం ధ్రువపత్రం మంజూరు చేస్తారు.
ఏమేం కావాలంటే..
సదరం సర్టిఫికెట్ కోసం స్లాట్ బుక్ చేసుకునేందుకు కొన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. (What are the Requirements to Book a Slot) మీకు దగ్గరలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయానికి లేదా మీసేవా కేంద్రానికి వెళ్లినప్పుడు ఈ పత్రాలు జిరాక్సు తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు, అప్లికేషన్ ఫాం, ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్ కలిగిన ఫోన్, పుట్టు మచ్చల వివరాలు అంటే టెన్త్ సర్టిఫికెట్ తప్పనిసరిగా నఖలు తీసుకెళ్లాలి.
ప్రభుత్వ పథకాలు అందుకునేందుకు ఎంత వికలాంగ శాతం ఉండాలి?
వికలాంగులకు ఏదైనా ప్రభుత్వ పథకం అర్హత సాధించాలి అంటే వారికి శాతాన్ని తెలిపే సర్టిఫికెట్ ఉండాలి. ప్రభుత్వ పరంగా దివ్యాంగులకు వర్తించే పథకాలు కొన్ని ప్రత్యేకించి ఉన్నాయి. దివ్యాంగుల పెన్షన్ ఇప్పుడు ఏపీలో రూ.6 వేలు అందుతోంది. ఇక బస్సు, రైలు పాసులు, ఇతర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత విషయంలో సడలింపులు వర్తించాలంటే, రిజర్వేషన్లు పొందాలంటే కనీసం 40 శాతం వికలాంగత్వం సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.
తాత్కాలిక సర్టిఫికెట్లతో పింఛన్ పొందవచ్చా?
కొందరికి తమకు లోపం ఉందని భావిస్తుంటారు. ఆ లోపం కొంత కాలానికి పూర్తి స్థాయిలో నయం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్దేశంతో వైద్యులు ఇలాంటి వారికి తాత్కాలిక ధ్రువపత్రాలు లేదా రీ అసెస్ మెంట్ సర్టిఫికెట్ కొంత కాలానికి మంజూరు చేస్తారు. అయితే వారు ఇచ్చిన కాలానికి కూడా వారి లోపం నయం కాని పక్షంలో మళ్లీ సర్టిఫికెట్ కోసం ఆస్పత్రి (Hospital) నుంచి సిఫార్సు చేస్తే వారు మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత డాక్టర్ కు చూపించాలి. ఆ తర్వాత శాశ్వత సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. అయితే, తాత్కాలిక సర్టిఫికెట్ తో పెన్షన్ కోసం దరఖాస్తు చేయడానికి వీల్లేదు. శాశ్వత సర్టిఫికెట్ తో మాత్రమే అర్హులు అవుతారు.
సదరంలో తిరస్కరణకు గురైతే ఎలా?
పలువురికి సదరం క్యాంపుల్లో సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా, వికలాంగ శాతం 40 శాతానికి తక్కువగా ఉంటే అలాంటి వారికి సదరం సర్టిఫికెట్లు నిరాకరిస్తారు. అయితే, తమకు అర్హత ఉన్నా తిరస్కరించారని భావించే వారు ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే గ్రీవెన్స్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. అలాంటి వారికి మళ్లీ మరో ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. అక్కడకు వెళ్లి డాక్టర్ కి చూపించిన తర్వాత సదరు వైద్యుడు వీరికి రీ అసెస్మెంట్ కి అర్హత ఉందని భావిస్తే, వారు తీసుకున్న ఓపీ ఫాం మీద ఎలిజిబుల్ ఫర్ రీ అసెస్మెంట్ అని రాస్తారు. వైద్య విధాన పరిషత్ కు లెటర్ రాస్తారు. ఇలా ఆ వ్యక్తికి మళ్లీ రీఅసెస్మెంట్ కి అవకాశం కల్పిస్తారు.
సదరం సర్టిఫికెట్లతో ప్రయోజనాలు ఇవీ..
* ప్రభుత్వం అందించే రూ.6 వేల పెన్షన్ అందుకోవచ్చు.
* బస్సు, రైలు ప్రయాణాలలో రాయితీలు పొందవచ్చు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉద్యోగాలలో రిజర్వేషన్లు పొందవచ్చు.
* కొన్ని సందర్భాల్లో ప్రత్యేక వాహనాలు, పరికరాలు ప్రభుత్వం నుంచి ఉచితంగా లేదా రాయితీపై అందుకోవచ్చు.
గమనిక: సదరం సర్టిఫికెట్ల గురించి పూర్తి వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్న సచివాలయాన్ని, మీసేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు.
Read also: NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కు ఎలా అప్లయ్ చేయాలి?
CBN vs YS Jagan: తగ్గేదే లేదు.. ఏపీలో హై వోల్టేజ్ రాజకీయం!
Paper Leak: మీకు తెలుసా? భారత్‌లో 2019 నుంచి 65 పేపర్ లీకేజీలు.. పూర్తి వివరాలు ఇవీ
Virat Kohli Water: విరాట్ కోహ్లీ తాగే వాటర్ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Women Food: 30 ఏళ్ల మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
