Tortoise: కూర్మావతారంగా శ్రీమహావిష్ణువు అవతరించిన అత్యంత పవిత్ర అవతారం చరిత్రలో మనం చదువుకున్నాం. తాబేళ్లను మనం దేవుడితో సమానంగా ఆరాధిస్తాం. తాబేళ్లను దేవుడి ప్రతిరూపంగా పూజలు చేస్తారు. అయితే కొంత మంది తాబేళ్లను ఆహారంగా కూడా తీసుకుంటారట. తాజాగా ఇలాంటి ఘటన వెలుగు చూసింది.
కొంత మంది తాబేళ్లను ఆహారంగా తీసుకుంటుంటారు. ఇటీవల తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఆఫ్రికాలో ఒకానొక దేశమైన టాంజానియాలోని జాంజిబార్‌లో జరిగింది. ఈ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఆ సందర్భంగా మరో 78 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రికి చేరారు.
తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సాధారణంగా సముద్ర తాబేళ్లను ఎక్కువ శాతం మంది మాంసం చేసి వండుకుని తింటుంటారు. అక్కడ లభించే సముద్ర తాబేళ్ల మాంసానికి మాంచి గిరాకీ కూడా ఉందట. చుట్టుపక్కల దేశాల వాళ్లు కూడా తాబేలు మాంసం కోసం టాంజానియా ప్రాంతానికి వస్తుంటారని తెలుస్తోంది. పలు రకాల ఫ్లేవర్లలో టేస్టీటేస్టీ తాబేలు మాంసాన్ని అక్కడ విక్రయం చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక షాకింగ్ ఘటన చోటు వెలుగు చూసింది.
సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 78 మంది ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ షాకింగ్ ఘటనతో ఒక్కసారిగా తూర్పు ఆఫ్రికా ప్రాంతం అంతా అలజడి రేగింది. అస్వస్థతకు గురైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా మారి మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు కారణం ఏమై ఉంటుందనే దానిపై అంశంపై అక్కడి భద్రతాబలగాలు దర్యాప్తు చేస్తున్నారట. తాబేలులో కిలోనిటాక్సియం అనే పదార్థం ఉంటుందని, దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందని అక్కడి వైద్యులు అభిప్రాయపడ్డారు. అందుకే ఈ విషాదం చోటుచేసుకుని ఉంటుందని చెబుతున్నారు.
ఇవీ చదవండి: Eye health: కంటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
Kakara Kaya: చేదైన ఆహారం.. పోషక గుణాల్లో తియ్యదనం.. కాకర కాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవీ..
Cluster Beans: గోరుచిక్కుడుతో అద్భుత ప్రయోజనాలు.. కండరాల ఎదుగుదలకు చక్కటి ఆహారం
Cashew: జీడిపప్పు ఆహారంలో భాగం చేస్తున్నారా? ఆరోగ్యం మీ సొంతం.. జీడిపప్పు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవీ..
Best Veg Food: శాకాహారంలో బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏవి? మంచి ప్రోటీన్స్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
