HomeInternationalRamadan in Malaysia: మీకు తెలుసా.. ముస్లిం దేశం మలేషియాలో రంజాన్‌ నిబంధనలు ఎలా ఉంటాయంటే..

Ramadan in Malaysia: మీకు తెలుసా.. ముస్లిం దేశం మలేషియాలో రంజాన్‌ నిబంధనలు ఎలా ఉంటాయంటే..

Ramadan in Malaysia: ముస్లిం సోదరుల పవిత్రమాసం రంజాన్. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అయితే, ముస్లిం దేశమైన మలేషియాలో రంజాన్ సందర్భంగా కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. మలేషియాలో రంజాన్ నెలలో నైతిక పోలీసింగ్ తీవ్రతరం అవుతుంది. ఎవరైనా తినడం, తాగడం లేదా రంజాన్ నిబంధనలను పాటించకపోవడం లాంటివి చేస్తే అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తారు. పగలు తింటూ లేదా తాగుతూ పట్టుబడితే 1,000 మలేషియా రింగిట్ (సుమారు మన ఇండియన్ కరెన్సీలో రూ.16 లక్షలు) జరిమానాతో పాటు ఒక సంవత్సరం వరకు కారాగార వాసం విధిస్తారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఆహారం లేదా పానీయాలు లేదా పొగాకు విక్రయిస్తూ కనబడితే ముస్లిమేతరులకు కూడా భారీ జరిమానా తప్పదట.

ఇస్లామిక్ క్యాలెండర్‌లో రంజాన్ అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. ఈ సమయంలో ముస్లింలందరూ ఉపవాస దీక్షలో ఉంటారు. దీని కారణంగా వారు పగటిపూట తినడానికి, తాగడానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని ముస్లింలు విరమిస్తారన్నది తెలిసిందే. మలేషియాలోని అనేక ప్రాంతాల్లో పగలు ఎవరినా తింటూ, లేదా తాగుతూ దొరికితే వారిపై మోరల్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తారు. మలేషియా దేశంలోని మొత్తం 34 మిలియన్ల జనాభాలో దాదాపు 20.6 మిలియన్లు ముస్లిం సోదర సోదరీమణులే.

అయితే మలేషియా దేశంలో బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులతో పాటు చైనీస్ , భారతీయ మైనారిటీలు కూడా నివసిస్తున్నారు. దేశంలో షరియా చట్టం అమలులో ఉంది. దీంతో ముస్లిం వివాహం, విడాకులు, ఉపవాసం వంటి అనేక సామాజిక సమస్యలకు షరియా చట్టం నిబంధనలు అమలు చేస్తారు.

2023లో భారీగా అరెస్టులు
పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో మతపరమైన వ్యవహారాలపై పోలీసులు తమ పెట్రోలింగ్‌ను ఉధృతం చేస్తారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిని పట్టుకోవడానికి ప్రసిద్ధ స్టార్ హోటళ్లలో పెట్రోలింగ్ నిర్వహిస్తారు. ఎవరైనా తింటున్నట్లు లేదా తాగుతున్నట్లు కనిపిస్తే కఠినంగా శిక్షిస్తారు. గతేడాది 2023లో మలక్కా రాష్ట్రంలోని మతపరమైన అధికారులు రంజాన్ మాసంలో తింటూ పట్టుబడిన దాదాపు 100 మంది ముస్లింలను అదుపులోకి తీసుకున్నారు.

హాట్‌ స్పాట్లు
ఇటీవల ముగిసిన రంజాన్ వేడుకలపై కూడా అక్కడి పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేశారు. అక్కడి రాష్ట్రవ్యాప్తంగా 10కి పైగా “హాట్‌స్పాట్‌లు” గుర్తించినట్లు మెలకా ఇస్లామిక్ రిలిజియస్ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ జైమ్ వెల్లడించారు. బార్లు, రెస్టారెంట్లు, మాల్స్ , పార్కులలో నిరంతరం పర్యవేక్షణ, సోదాలు జరుగుతాయన్నారు. ఈ కార్యకలాపాల ద్వారా ఆహారం తింటున్న ముస్లింలను జైమ్ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. అదే సమయంలో వారికి ఆహారాన్ని అమ్మే వ్యాపారులపై కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

Read Also: Ramadan: రంజాన్ ఉపవాస కాలం ఏమిటి? ప్రత్యేకతలు.. ప్రాశస్తం ఏమిటంటే..!
Blood donation: రక్తదానంతో గుండె జబ్బులు, క్యాన్సర్ల ప్రమాదం దూరం!
Memantha Siddham: మూడు వారాలుగా జనం మధ్యలోనే జగన్‌.. పండుగలు కూడా బస్సు యాత్రలోనే!
YS Jagan in Kurnool: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లపై మీ జగన్ మాట ఇస్తున్నాడు.. కర్నూలులో సీఎం జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు