Nigeria Jail: నైజీరియాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఓ జైలు దెబ్బతింది. నైజీరియా రాజధాని అబూజ సమీపంలోని సులేజా ప్రాంతంలో ఉన్న జైలు భారీ వర్షాలకు కూలింది. ఈ నేపథ్యంలో ఆ జైలు ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ గోడతో పాటు జైలు పరిసర ప్రాంతాల్లో ఉన్నమరికొన్ని బిల్డింగులు కూడా శిథిలమయ్యాయి. అయితే, ఇదే అదనుగా భావించిన ఆ జైలులోని ఖైదీలు.. బాహ్య ప్రపంచంలోకి పారిపోవాలని డిసైడ్ అయ్యారు. ఆ జైలులో ఉన్న 118 మంది ఖైదీలు పారిపోయినట్లు అక్కడి జైలు అధికారులు వెల్లడించారు.
ఇటీవల ఈ ఘటన ఆ దేశంలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించారు. పారిపోయిన ఖైదీల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. వీరిలో కొందరు వెంటనే దొరికారని వెల్లడించారు. మిగిలినవారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఎవరెవరు తప్పించుకున్నారన్న వివరాలు మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వలేకయారు.
గతంలో ఇదే జైలులో బోకో హరమ్ గ్రూప్ సభ్యులను కూడా బంధించారు. ఇటీవల పారిపోయిన వారిలో బోకో హరమ్ దళం వారు కూడా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఖైదీలు జైలు నుంచి తప్పించుకోవడంతో ఆయా కేసుల్లో బాధితులుగా ఉన్నవారు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నైజీరియా జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోవడం గతంలో కూడా చాలా సార్లు జరిగిందని, అక్కడి జైళ్ల వ్యవస్థలో లోటుపాట్లే ఇందుకు కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: Venu swamy: వేణు స్వామి పునరుద్ఘాటన.. మరోసారి ఏపీలో వచ్చేది జగనే! త్వరలో కేటీఆర్ జైలుకు!
Posani Krishna Murali: బాబుపై పోసాని సంచలన ఆరోపణలు జైల్లో ఉండి కుట్రపన్నారని వ్యాఖ్య
Sajjala on chandrababu: జైలు ఏమైనా అత్తగారి ఇల్లా .. ఏసీ పెట్టమని అడుగుతున్నారు
Marriage: మీకు తెలుసా? అక్కడ ప్రతి వ్యక్తీ ఇద్దరిని మనువాడాలట!
Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్‌కు రెండేళ్ల జైలు శిక్ష.. అల్లు అరవింద్ ఇచ్చిన పరువు నష్టం దావా కేసులో..!
