Posani Krishna Murali: చంద్రబాబు జైల్లో ఉంటూనే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నారని సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు. భువనేశ్వరి, లోకేష్ పైనా పోసాని ఫైర్ అయ్యారు. బాబుకు మంచి భోజనం భువనేశ్వరి పంపడం లేదా ? అని ప్రశ్నలు గుప్పించారు. బాబుకు మంచి మందులు పంపడం లేదా ? అని నిలదీశారు. లోకేష్ ఆడే డ్రామాలు అమిత్ షాకు తెలుసని పోసాని స్పష్టం చేశారు. (Posani Krishna Murali)
చంద్రబాబుకు అసలు క్యారెక్టర్ ఉందా ? అని పోసాని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావని చెప్పారు. జైల్లో ఉన్న చంద్రబాబు వాస్తవానికి కేజీ బరువు పెరిగిన విషయాన్ని పోసాని గుర్తు చేశారు. టీడీపీ నేతలు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలేనంటూ పోసాని చెప్పారు. చంద్రబాబును ఏపీ ప్రజలు పట్టించుకోవడం లేదని, ఈ విషయం టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు.
వైయస్సార్‌సీపీ ప్రభుత్వం పై బాబువన్నీ కుట్ర రాజకీయాలేనని పోసాని మండిపడ్డారు. బాబు చేసిన మోసాలపై భువనేశ్వరి నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు ఓట్ల కోసం ఏడిస్తే .. సీఎం జగన్ ప్రజల కోసం పరితపిస్తారని పోసాని చెప్పారు. జైల్లో దోమలంటూ భువనేశ్వరి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి అలాంటిదేం లేదని చంద్రబాబు కోర్టు ఎదుట న్యాయమూర్తికి కూడాచెప్పారని పోసాని గుర్తు చేశారు.
ఏపీకి చంద్రబాబు ఎప్పుడూ చిరస్మరణీయ నాయకుడు కాలేడని పోసాని స్పష్టం చేశారు. కులం పిచ్చిని టీడీపీ ప్రోత్సహిస్తోందని, అది ఎంత మాత్రం మంచిది కాదని పోసాని కృష్ణమురళి చెప్పారు. సినీ పరిశ్రమ ఏపీకి రావాలని సీఎం కోరారని పోసాని చెప్పారు. స్టూడియోల కోసం 50 ఎకరాల వరకు ఇస్తామన్నారని గుర్తు చేశారు. పరిశ్రమ కోసం ప్రోత్సాహకాలు ఇస్తామన్నారని తెలిపారు. విశాఖకు వచ్చే అవకాశాన్ని పరిశీలించాలని తెలుగు సినీ పరిశ్రమను కోరుతున్నామన్నారు.
Read Also : Sajjala on chandrababu: జైలు ఏమైనా అత్తగారి ఇల్లా .. ఏసీ పెట్టమని అడుగుతున్నారు