Sajjala on chandrababu: జైలు ఏమైనా అత్తగారి ఇల్లా .. ఏసీ పెట్టమని అడుగుతున్నారు

Sajjala on chandrababu: చంద్రబాబు ఆరోగ్యం విషమించిందని టీడీపీ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ముప్పు ఉందంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇదే తరహా ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. స్కిన్ ఎలర్జీ తో ప్రాణానికే ముప్పని ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. (Sajjala on chandrababu)

జైలు అధికారులు, డాక్టర్ల మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇది సమంజసం కాదన్నారు. చంద్రబాబు బరువు తగ్గారంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తప్పు చేశారు కాబట్టే కోర్టు రిమాండ్ కు పంపిందని గుర్తుంచుకోవాలన్నారు. జరిగిన తప్పు మీద టీడీపీ మాట్లాడడం లేదన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..

– చంద్రబాబు ఆరోగ్యం పై జైలు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
– ప్రతిరోజూ చంద్రబాబు ఆరోగ్యాన్ని వైద్యబృందం పర్యవేక్షిస్తోంది.
– ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్నే చంద్రబాబు తింటున్నారు.
– భోజనాన్ని కూడా జైలు అధికారులు పరీక్షించాకే అనుమతిస్తున్నారు.
– ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలి.

– అర్జెంటుగా చంద్రబాబును బయటకు తీసుకొచ్చేయాలన్నదే వీరి తాపత్రయం
– జైలులో సకల సౌకర్యాలు ఉండాలనుకుంటున్నారు
– కోర్టు చెప్పకముందే జైలు అధికారులు వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు
– అమిత్ షా పిలిస్తేనే లోకేష్ వెళ్లాడని ఎల్లో మీడియా ప్రచారం చేసింది
– అమిత్ షాతో ఏం మాట్లాడారో తెలీదు కానీ ఎల్లో మీడియా కథనాలు చాలానే అల్లింది
– ఏ కోర్టులో ఉంది .. ఏ బెంచ్ విచారిస్తోందంటూ అడిగారంట

– అమిత్ షా తో భేటీని వీళ్లకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు
– స్కిల్ స్కామ్ కేసులో ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది
– లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ కు డబ్బులు అందాయి
– పెండ్యాల శ్రీనివాస్ కు కూడా డబ్బులు అందాయి

– పెండ్యాల శ్రీనివాస్, కిలారి రాజేష్ ఇద్దరూ విదేశాలకు జంప్ అయ్యారు
– చంద్రబాబు కేసులో ప్రభుత్వ జోక్యం లేదు
– కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు స్కామ్ ను వెలికితీశాయి
– కక్ష సాధింపు చర్యలు మాకు అలవాటు లేదు
– పూర్తి సాక్ష్యాధారాలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది

– అసలు విషయాన్ని డైవర్ట్ చేయడానికే టీడీపీ ప్రయత్నిస్తోంది
– చంద్రబాబు అరెస్టు కు రాజకీయ ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు
– ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది పెద్ద స్కామ్‌
– రాని రోడ్డు మీద స్కాం ఏంటి అంటున్నారు .. లేని అమరావతి మీద మీరు చేసింది స్కామే కదా
– ఫైబర్ నెట్ కూడా అడ్డగోలుగా జరిగిన స్కామ్‌

– ఈ కేసులన్నింటిలోనూ అవినీతి జరిగినట్టు స్పష్టంగా కనబడుతోంది
– పవన్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తాయి
– ఏ విమర్శలు వచ్చినా వాటికి సమాధానాలు చెప్పాల్సిందే.

ఇదీ చదవండి: CM Jagan at Kakinada: బాబు పేరు చెబితే స్కాములు.. జగన్‌ పేరు చెబితే స్కీములు గుర్తుకొస్తాయి: సీఎం జగన్‌

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles