HomeLife StyleRamadan: రంజాన్ ఉపవాస కాలం ఏమిటి? ప్రత్యేకతలు.. ప్రాశస్త్యం ఏమిటంటే..!

Ramadan: రంజాన్ ఉపవాస కాలం ఏమిటి? ప్రత్యేకతలు.. ప్రాశస్త్యం ఏమిటంటే..!

Ramadan: ఇటీవల రంజాన్ పండుగ ముగిసిన సంగతి తెలిసిందే. ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. రంజాన్ అన్నది ముస్లింలందరికీ ఒక పవిత్ర కాలం. రంజాన్ మాసంలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు భక్తితో ఉపవాసం ఉంటారు. రంజాన్ అంటే కేవలం ఉపవాసం కాదు. ఇది ఆధ్యాత్మికతను పెంచే కాలం అని చాటి చెబుతారు.

రంజాన్ మాసంలో ముస్లింలు ఆత్మశోధన చేసుకుంటూ అల్లాకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తారు. నెలంతా ఉపవాసం ఉండే ఈ నెలలో ముస్లింలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఉపవాసం విరమించే సమయం అయిన ఇఫ్తార్ విధానం, తెల్లవారుజామున తినే సుహూర్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటారు.

ఇఫ్తార్
ముస్లింలు మామూలుగా ఇఫ్తార్‌ను ఖర్జూరం, నీరు లేదా పాలతో మొదలు పెడతారు. ఖర్జూరాల్లో సహజసిద్ధ షుగర్స్ లభ్యమవుతాయి. ఇవి ఇన్‌స్టంట్ ఎనర్జీని చేకూరుస్తాయి. వీటిలోని మినరల్స్ ఉపవాసం వల్ల కోల్పోయిన ఎనర్జీని మళ్లీ తెస్తాయి. ఖర్జూరాలు తిన్న తర్వాత, సమతుల భోజనం చేయాల్సి ఉంటుంది. బ్రౌన్ రైస్ లేదా హోల్ వీట్ బ్రెడ్, చికెన్ లేదా లెంటిల్స్ వంటి లీన్ ప్రొటీన్లు, వివిధ రకాల కూరగాయల వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ఆహారంలో చేర్చుకోవాలి. సూప్‌లు, కూరలు కూడా తీసుకోవాలి.

ఫాస్టింగ్
తెల్లవారే చేసే సుహూర్ కోసం, పోషకాలు ఎక్కువగా ఉన్న ఫైబర్ కంటెంట్‌ ఉన్న ఆహారాలను తీసుకుంటారు. ఓట్స్, హోల్ వీట్ బ్రెడ్, క్వినోవా వంటి తృణధాన్యాలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్లు, పప్పు, పండ్లు, కూరగాయలు, నట్స్, సీడ్స్ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో హెల్తీ ఫ్యాట్ ఉంటుంది. ఈ ఆహారాలు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని నింపుతాయి. రక్తప్రవాహంలోకి చక్కెరలను నెమ్మదిగా విడుదల చేసేలా చూస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా నీరు తాగాలి.

రంజాన్ సమయంలో నెల రోజుల పాటు ఫాస్టింగ్ ఉంటే గ్లూకోజ్ హోమియోస్టాసిస్‌లో ఛేంజెస్‌ చోటు చేసుకుంటాయి. దీంతో డయాబెటిస్ బాధితులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట ఆహారం, ద్రవాలు తీసుకోపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో హెచ్చుతగ్గులు వస్తాయి. ముఖ్యంగా హైపోగ్లైసీమియా, హైపర్గ్లైసీమియా ముప్పు వాటిల్లుతుంది. ఉపవాసం సురక్షితమో కాదో నిర్ధారించడానికి ఎండోక్రినాలజిస్ట్ లేదా సర్టిఫైడ్ డయాబెటిస్ ఎడ్యుకేటర్‌ను కాంటాక్ట్‌ అవ్వాలి. తీసుకునే మందుల విషయంలో కూడా తగిన ఏర్పాట్లు చూసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను రెగ్యులర్‌గా చెక్‌ చేసుకుంటూ ఉండాలి.

ఇవి తినకూడదు..
డీప్‌ఫ్రైడ్ పదార్థాలు, పంచదారతో చేసిన స్నాక్స్, హైలీ ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ రంజాన్ మాసం ఉపవాసం సందర్భంగా తీసుకోరాదు. ఇవి అసౌకర్యం కలిగిస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగేలా చేస్తాయి. హైడ్రేటెడ్‌గా ఉండటానికి, ఉపవాసం లేని సమయాల్లో పుష్కలంగా నీరు తీసుకోవాలి. హెర్బల్ టీలు లేదా పండ్లతో కలిపిన నీరు వంటివి కూడా తీసుకోవచ్చు.

ఫాస్టింగ్‌తో ప్రయోజనాలు
రంజాన్ సమయంలో ఉపవాస దీక్ష పాటిస్తూ ఇన్సులిన్ సెన్సిటివిటీని డెవలప్‌ చేసుకోవచ్చు. బెటర్ గ్లైసెమిక్ కంట్రోల్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఫాస్టింగ్ చేస్తే ఆటోఫాగీ యాక్టివేట్ చేసినట్లవుతుంది. ఆటోఫాగీ అనేది దెబ్బతిన్న భాగాలు రీసైకిల్ చేసే సెల్యులార్ ప్రక్రియ. ఇది వయసుతో పాటు వచ్చే వ్యాధులను నివారిస్తుంది.

ఇవీ చదవండి: CM Jagan Ramzan wishes: ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి జగన్‌ ‘ఈద్‌ ముబారక్‌’
Memantha Siddham: మూడు వారాలుగా జనం మధ్యలోనే జగన్‌.. పండుగలు కూడా బస్సు యాత్రలోనే!
Muslim Voters in AP: ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలివే..
Andhra Pradesh Voters: ఆంధ్రప్రదేశ్‌లో మీ సామాజికవర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు