శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
National

Aadhar Update: జూన్‌ 14 వరకు ఆధార్‌లో మార్పులు ఉచితంగా చేసుకోవచ్చు!

ప్రచురణ తేదీ: ఆదివారం, 5 మే 2024

Aadhar Update: ఆధార్‌లో చిరునామా మార్పు, ఫోన్‌ నంబర్‌ మార్పు, పేర్లు తప్పుగా ఉంటే మార్చుకోవడం.. తదితర మార్పులు నిత్యం చేస్తూనే ఉంటాం. దేశవ్యాప్తంగా ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు వాస్తవానికి ఈ ఏడాది మార్చి 14తో ముగిసింది. కానీ ఇటీవలే మరో మూడు నెలలు గడువు పొడిగించింది కేంద్రం. ఈ మేరకు ఉడాయ్‌ ఇటీవల వెల్లడించింది.

జూన్‌ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చని ఉడాయ్‌ తెలిపింది. తొలుత 2023 మార్చి15 వరకు ఉన్న గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. తర్వాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్‌ చేసుకునేందుకు వీలు కల్పించారు. ఇటీవల మరోసారి గడువు తేదీని ఎక్స్‌టెండ్‌ చేశారు. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్‌ ప్రకటించింది.

ఆధార్‌ కార్డు తీసుకుని పది సంవత్సరాలు పూర్తి అయిన వారు తమ డెమోగ్రఫిక్‌ వివరాలు అప్‌డేట్‌ చేయాలి. ఇందుకోసం ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి లేటెస్ట్‌ గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించ వచ్చని అధికారులు చెబుతున్నారు.

టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌/ఇ-ప్యాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లాంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా వినియోగించవచ్చని ఉడాయ్ తెలిపింది. విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా సమర్పించవచ్చని ఉడాయ్‌ వెల్లడించింది. ఉచిత సేవలు ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచినట్లు ఉడాయ్‌ పేర్కొంది.

ఇవీ చదవండి: Vote: ఓటు వేసేందుకు ఆధార్‌ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత
Child Aadhar: బ్లూ ఆధార్‌.. బాల ఆధార్‌.. ఎలా తీసుకోవాలి?
Address Change in Aadhar: ఆధార్‌లో చిరునామా మార్పు ఇక మరింత సులువు
WhatsApp: ఆధార్, పాన్‌ కార్డు వాట్సప్‌లో డౌన్‌లోడ్‌ చేసేయండి!
Andhra Pradesh Voters: ఆంధ్రప్రదేశ్‌లో మీ సామాజికవర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?

Summarize with AI

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading