HomeAndhra PradeshAP Employees: టీడీపీ మేనిఫెస్టోతో డైలమాలో ఏపీ ఉద్యోగులు! మైండ్ సెట్‌ మారిందా?

AP Employees: టీడీపీ మేనిఫెస్టోతో డైలమాలో ఏపీ ఉద్యోగులు! మైండ్ సెట్‌ మారిందా?

AP Employees: ఏపీలో మేనిఫెస్టోలు ప్రధాన పార్టీలు ప్రకటించాయి. తొలుత వైయస్సార్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ తన మేనిఫెస్టోను క్యాంప్‌ కార్యాలయంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే టీడీపీ మేనిఫెస్టోను కూటమి నేతలు విడుదల చేశారు. కాగా ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో, టీడీపీ కూటమి మేనిఫెస్టో పోలికలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి ఏమిటి? రెండు మేనిఫెస్టోలపై ఏరకంగా మనసులో అనుకుంటున్నారన్నది చర్చోప చర్చలు నడుస్తున్నాయి.

ముఖ్యంగా టీడీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత చాలా మంది ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో నిన్నటి వరకు ఉన్న అభిప్రాయం మారిపోతోందట. అదేంటి అనుకుంటున్నారా? తాము ట్యాక్స్ లు కడితే జగన్ పేదల కు బటన్ నొక్కి డబ్బులు పంచు తున్నాడంటూ ఉద్యోగులు మొన్నటి దాకా పెదవి విరిచారు. కానీ టీడీపీ మేనిఫెస్టో చూశాక నెమ్మదిగా ఆలోచించడం ప్రారంభించారట.

చంద్రబాబు ఒక వేళ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రూ.1.50 లక్షల కోట్లు కూడా సరిపోని విధంగా ఆయన మేనిఫెస్టో ఉంది. ఇక తమ జీతాల సంగతి, వాటి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఉద్యోగులు అప్పుడే గుసగుసలాడుకుంటున్నారట. అందులోనూ ఈ మేనిఫెస్టోను బీజేపీ అగ్రనేతలు ఒప్పుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఫరదర్‌గా ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని కుండబద్దలు కొట్టినట్లవుతోంది.

కేంద్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి సహాయ సహకారాలు అందించే విధంగా కనపడడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక సీఎం జగన్ పాలనలో అయితే కనీసం నాడు-నేడుతో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ బడులు బాగుపడుతున్నాయి. పేదలకు విద్య, వైద్యం ఎంతో బాగా అందుతున్నాయని ఉద్యోగులు ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు మంచి పౌష్టికాహారం అందుతోంది.

గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్, అర్బన్‌ లో హెల్త్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌ లాంటి కాన్సెప్టుల ద్వారా ఇంటింటికీ వైద్యం సులభంగా అందుతోంది. సంక్షేమ పథకాల తర్వాత ఎలాగూ సీఎం జగన్‌ వచ్చే టర్ము నుంచి అభివృద్ధి మీద కూడా ఫోకస్‌ పెట్టే అవకాశం ఉందని ఉద్యోగస్తులు చర్చలు జరుపుకుంటున్నారు.

జగన్‌ ఐదేళ్లలో నిరుపేదలకు అందించిన సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పుల పాలయిందని, మరో శ్రీలంకగా మారిపోయిందంటూ గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలు అంతకంటే దారుణమైన ఉచితాలను అందిపుచ్చుకోవడంలో అవకాశవాదం ఉందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ప్రజలను సోమరులను చేస్తున్నారన్న పెద్దలే తమ మేనిఫెస్టోలో జగన్ అందిస్తున్న పథకాల కంటే ఎక్కువే ఇస్తామని హామీలు గుప్పిస్తున్నారు. మరిన్ని అప్పులు చేయడానికి రెడీ అని ముందుకొస్తున్నారు.

దొంగలని, బందిపోట్లని తీవ్రంగా విమర్శించిన వాలంటరీ వ్యవస్థను తాము మళ్లీ కొనసాగించి తీరుతామంటూ హామీలు ఇస్తున్నారు. అంటే ఆ వ్యవస్థ బాగున్నట్టే అని అంగీకరించినట్లేనని ఉద్యోగులు చెబుతున్నారు. అందుకే పట్టణ ప్రాంతంలో కూడా స్పష్టమైన మార్పు వచ్చిందని ఉద్యోగుల్లో చాలా మంది అనుకుంటున్నారు. మరి ఉద్యోగులు ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి: YS Jagan in Kalikiri: కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫొటో వద్దంటూ బాబుకు బీజేపీ ఫోన్‌ చేసింది: కలికిరిలో సీఎం జగన్
YSRCP Manifesto: 2024 వైయస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..
YSRCP Manifesto 2024: మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం రాదు.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదలలో జగన్‌
YSRCP Manifesto 2024: దటీజ్‌ జగన్ గట్స్‌.. మేనిఫెస్టోలో ఒక్కటి కూడా ప్రజాకర్షక హామీ లేదు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు