HomeLife StyleChickpea: శనగలు నానబెట్టి ఇలా తీసుకుంటే ప్రోటీన్స్ మీ సొంతం!

Chickpea: శనగలు నానబెట్టి ఇలా తీసుకుంటే ప్రోటీన్స్ మీ సొంతం!

Chickpea: రోజూ నానబెట్టిన పచ్చి శనగలు తినటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మంచి పోషకాహారం లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. పచ్చి శనగలను నీటిలో నానబెట్టి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే, శరీరానికి బహుళ ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రోటీన్ లభించే వెజిటబుల్స్‌లో శనగలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పచ్చి శనగల్లోని ప్రొటీన్ కండరాల నిర్మాణానికి, శరీర బహుళ విధులకు, రక్త ప్రసరణలో ఉపయోగపడుతుంది.

పచ్చి శనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా లభిస్తాయి. ఈ ఆహారం శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగయ్యేలా చేస్తుంది. పచ్చి శనగలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్వరం, జలుబు వంటివి రాకుండా ఉంటాయి.

గుండెకు ఆరోగ్యానికి మంచిది
పచ్చి శనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ స్వల్పంగానే ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు పచ్చి బఠాణీలను భయం లేకుండా తినేయవచ్చు. షుగర్ లెవెల్స్ పెరుగుతాయన్న భయం వీడండి. పచ్చి శనగల్లో కొలెస్ట్రాల్ చాలా స్వల్పంగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. పచ్చి శనగలలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎనర్జిటిక్‌గా గడపేయొచ్చు..
పచ్చి శనగలు తక్షణ శక్తినిచ్చే పోషకాహారంగా నిపుణులు చెబుతున్నారు. పచ్చి శనగలు తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా గడపొచ్చు. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. పని చేయడానికి తక్షణ శక్తి వచ్చేలా చేస్తుంది.

పచ్చి శనగల్లో డైటరీ ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని అరికడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే, కచ్చితంగా నానబెట్టిన పచ్చి శనగలు తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. పచ్చి శనగలు బరువును అదుపులో ఉంచడంలోనూ సాయపడతాయి.

ఇవీ చదవండి: Peas: వేయించిన శనగలు.. మితంగా తీసుకుంటే రుచి, ఆరోగ్యం.. ప్రోటీన్స్ సమ్మిళితం
Onion: ఉల్లిపాయ తొక్కతో ఊహించని ప్రయోజనాలు..!
ORS Benefits: ఈ ఎండ కాలంలో ఓఆర్‌ఎస్‌ తాగితే విస్తృత ప్రయోజనాలు మీ సొంతం!
Cool Drinks Danger: చల్లటి పానీయాలు ప్రాణాంతం.. కాలేయ క్యాన్సర్‌ కారకం!
Açaí berry: అకాయ్‌ బెర్రీలు నెలరోజులపాటు ప్రతి రోజూ తినడం వల్ల మీ శరీరానికి జరిగేది ఇదే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు