Sleep: మనిషికి నిద్ర అత్యంత అవసరం. సరైన నిద్ర లేకపోతే అన్ని రోగాలు వచ్చి చేరుతాయి. నిద్ర తక్కువైతే మనిషి ఆనారోగ్యం బారినపడటం ఖాయం. పెద్దలకు, సగటున ప్రతి రోజూ రాత్రి 7, 8 గంటల నిద్ర అవసరం అవుతుంది. ఆదమరచి నిద్ర పోవడంవల్ల రోజంతా చేసిన శ్రమ, కలిగిన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
నిద్ర మెదడుకు విశ్రాంతి, రికవరీ కాలాన్ని అందజేస్తుంది. ఇది బ్రెయిన్ రిపేర్, పునరుజ్జీవనాన్ని కలిగిస్తుంది. మెదడు ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా కీలకం. ప్రతి మనిషి నాణ్యమైన నిద్రను పొందడం కీలకం. మంచి నిద్ర మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనిషిని ఉత్సాహపరుస్తుంది. మనిషి ఆరోగ్యంపై నిద్ర ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
మెమరీ కన్సాలిడేషన్
REM (రాపిడ్ ఐ మూవ్‌మెంట్) నిద్రలో, మెదడు జ్ఞాపకాలను ప్రాసెస్ చేయగలదు. మరియు ఏకీకృతం చేయగలదు. మనం కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, సమాచారాన్ని స్టోర్ చేసుకోవడానికి ఇది ఎంతగానో సాయపడుతుంది.
భావోద్వేగ నియంత్రణ
భావోద్వేగాలను కంట్రోల్‌లో ఉంచుకోవడంలో నిద్రది కీలక పాత్ర. ఒత్తిడి, ఆందోళన, మానసిక స్థితిని నిర్వహించడానికి మంచి నిద్ర దోహదపడుతుంది. నిద్రలేమి భావోద్వేగ ప్రతిచర్యలను తీవ్రంగా పెరిగేలా చేస్తుంది.
న్యూరోట్రాన్స్మిటర్ బ్యాలెన్స్
మానసిక స్థితి కంట్రోల్‌కు, మొత్తం మానసిక ఆరోగ్యానికి అవసరమైన సెరోటోనిన్, డోపమైన్, నోర్‌పైన్‌ఫ్రైన్ వంటి మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్‌ల సమతుల్యతను కాపాడుకోవడానికి నిద్ర అత్యంత అవసరం.
హార్మోన్ల నియంత్రణ
గ్రోత్ హార్మోన్, కార్టిసాల్, మెలటోనిన్ వంటి హార్మన్ల విడుదలను నిద్ర బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇవి పెరుగదల, ఒత్తిడి ప్రతిస్పందన, నిద్ర మేల్కొనే చక్రం సహా వివిధ శారీరక విధులలో ముఖ్య భూమిక పోషిస్తాయి.
మెదడు డిటాక్స్
నిద్రలో గ్లింఫాటిక్ వ్యవస్థ మరింత చురుగ్గా మారుతుంది. రోజంతా మెదడులో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు, టాక్సిన్‌లను నశింపజేస్తుంది.
సినాప్టిక్ ప్లాస్టిసిటీ
స్లీప్ సినాప్టిక్ ప్లాస్టిసిటీకి మద్దతు ఇస్తుంది. ఇది కొత్త న్యూరల్ కనెక్షన్‌ల ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్న వాటిని స్వీకరించడానికి చాలా అవసరం అవుతుంది. సినాప్టిక్ ప్లాస్టిసిటీ.. కొత్తవాటిని నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి తోడ్పాటు అందిస్తుంది.
రోగనిరోధక పనితీరు
సరిపడినంత నిద్ర ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుంది. శరీరాన్ని అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. నిద్రలేమి రోగనిరోధక శక్తిని బాగా తగ్గించేస్తుంది.
న్యూరోజెనిసిస్
మెదడులోని కొన్ని ఏరియాల్లో కొత్త న్యూరాన్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో నిద్రది కీలక పాత్ర. మెదడు ప్లాస్టిసిటీకి దోహదపడుతుందని కొన్ని అధ్యయనాలు సైతం వెల్లడించాయి.
నరాల ప్రమాదం తొలగుతుంది
దీర్ఘకాలిక నిద్ర లేమి వల్ల అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. మంచి నిద్ర ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో దోహదపడుతుంది.
ఇవీ చదవండి: Sperm: నిద్రలో వీర్యం పోతోందని బెంగ పడుతున్నారా? ఇది మీకోసమే..
Good Sleep tips: సుఖ నిద్ర కోసం టిప్స్.. ఏ సమయంలో నిద్ర మంచిదంటే..
Health Care at night: రాత్రిపూట ఇవి తింటే పీడ కలలు వస్తాయి.. నిద్రాభంగం తప్పదు!
Chandrayaan 3 Update: జాబిల్లిపై నిద్రకు ఉపక్రమించిన ప్రజ్ఞాన్ రోవర్.. తొలి విడత పని పూర్తి.. సూర్యోదయం ఎప్పుడంటే!
Health Care tip: రాత్రిపూట ఇవి తింటే పీడ కలలే.. సుఖమైన నిద్రకు టిప్స్ ఇవీ..
