HomeAndhra PradeshEx CM Kiran: పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నాడు.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు

Ex CM Kiran: పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నాడు.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు

Ex CM Kiran: ఏపీ మంత్రి పెద్దిరెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు. రాజంపేట పార్లమెంటు బరిలో బీజేపీ తరఫున నిలిచిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఇప్పుడు వార్తల్లో నిలిచేందుకు సరికొత్త ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

మంత్రి పెద్దిరెడ్డికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సవాల్

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పద్మవతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డీసీసీ అధ్యక్షుడిగా చేయమంటూ పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నా కాళ్లు పట్టుకుని అడిగావని నేను కాణిపాకం, తరిగొండ గుడిలో ప్రమాణానికి సిద్ధమంటూ సవాల్ విసిరారు. నువ్వు సిద్ధమా.. అంటూ పెద్దిరెడ్డికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు.

అవినీతి, అక్రమాలు, బెదిరింపులు, దొమ్మీలు, దోపిడీలు పెద్దిరెడ్డి నైజమంటూ కిరణ్‌ కుమార్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ఇసుక, మద్యం, మైన్స్, భూముల్లో రూ.వేల కోట్లు దోచేశారని ఆరోపణలు గుప్పించారు. అధికార మదమెక్కి అహంకార పూరితంగా పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారంటూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేయడం కలకలం రేపింది.

ఇన్నాళ్లూ సైలెంటుగా ఉండి ఇప్పుడు ఫోకస్‌ పెంచుకునేందుకే ఇలాంటి కామెంట్స్ ను కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నారంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇవీ చదవండి: Rama chandra Yadav: మంత్రి పెద్దిరెడ్డిపై ఓ రేంజ్‌లో ఆరోపణలు గుప్పిస్తున్న రామచంద్ర యాదవ్‌.. పట్టించుకోని పెద్దాయన!
Minister Peddireddy: విశాఖ సర్కిల్ పరిధిలో జగనన్న హౌసింగ్ కింద లక్ష కొత్త ఇళ్లు.. రివ్యూలో మంత్రి పెద్దిరెడ్డి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు