Minister Peddireddy: విశాఖ సర్కిల్ పరిధిలో జగనన్న హౌసింగ్ కింద లక్ష కొత్త ఇళ్లు.. రివ్యూలో మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 30 లక్షలకుపైచిలుకు పేదలకు 1.1 సెంటు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించే పనికి పూనుకుంది. తాజాగా విశాఖపట్నం సర్కిల్‌ పరిధిలో జగనన్న హౌసింగ్‌ కింద లక్ష కొత్త ఇళ్లను నిర్మిస్తున్నామని రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy) పేర్కొన్నారు. విద్యుత్‌ రంగంపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంలోనే ఇళ్ల నిర్మాణం గురించి మాట్లాడారు.

విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాలను సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని, అదే క్రమంలో విద్యుత్ బకాయిల విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలకు సంబంధించిన పెండింగ్ బకాయిలును వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అలాగే న్యాయస్థానాల్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

ఈపీడీసీఎల్ పరిధిలో 33 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం పనులు మందకొడిగా జరుగుతుండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు సర్కిళ్ల పరిధిలో సాంకేతికంగా ఎక్కడైతే లో ఓల్టేజీ సమస్య ఉందో పరిశీలించి, అక్కడ మాత్రమే కొత్త సబ్ స్టేషన్లను నిర్మించాలని సూచించారు. 33 కెవి సబ్ స్టేషన్లు మంజూరు చేసినా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని ఆదేశించారు. కోస్తా ప్రాంతంలో పీక్ లోడ్ పరిస్థితిని చక్కదిద్దేందుకు పరిశ్రమల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించాలని కోరారు.

జగనన్న హౌసింగ్ కాలనీల్లో విద్యుద్దీకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఎస్పీడిసిఎల్ పరిధిలో వినియోగదారులకు అందిస్తున్న సేవల కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేశారని, అదే మాదిరిగా ఈపీడీసీఎల్ లోనూ ఆన్‌లైన్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చేలా అవగాహన పెంచాలని, సచివాలయ స్థాయిలో ఎనర్జీ అసిస్టెంట్ ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

విద్యుత్ భద్రతపై సిబ్బందికి శిక్షణ కల్పించాలని మంత్రి సూచించారు. ప్రమాదాల నివారణకు పోల్ టు పోల్ సర్వే చేయాలన్నారు. లూజ్ లైన్లను మార్చడంతో పాటు పాడైపోయిన కండక్టర్ లను ఎప్పటికప్పుడు మార్చాలని చెప్పారు. ఈదురు గాలుల వల్ల విద్యుత్ స్థంబాలు పడిపోయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై అధికారులు యుద్ద ప్రాతిపదికన వాటిని సరిచేయాలని ఆదేశించారు.

గోదావరిజిల్లాల్లో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉందని, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతో లో ఓల్టేజీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. అలాగే విశాఖ సర్కిల్ పరిధిలో కొత్తగా జగనన్న కాలనీల్లో లక్ష ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయని, వాటికి అవసరమైన విద్యుత్ ను అందించేందుకు కొత్తగా 68 సబ్ స్టేషన్లను మంజూరు చేశామని, త్వరలోనే వాటికి టెండర్లు పిలుస్తామని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 250 ఎంయుల విద్యుత్ డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తూ, కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Read Also : KS Bharath with CM Jagan: సీఎం వైఎస్‌ జగన్‌తో కేఎస్ భరత్‌.. ఏం మాట్లాడారంటే..!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles