HomeLife StyleMillet Milk: చిరుధాన్యాలతోనూ మిల్లెట్‌ మిల్క్‌.. ఇలా తయారు చేసుకోండి!

Millet Milk: చిరుధాన్యాలతోనూ మిల్లెట్‌ మిల్క్‌.. ఇలా తయారు చేసుకోండి!

Millet Milk: మనం మంచి ఆరోగ్యం కోసం ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తుంటాం. కోట్ల రూపాయల ఆస్తుల కన్నా మంచి ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదన్నమది ప్రస్తుతం బాగా పని చేస్తున్న నానుడి. ప్రస్తుత కాలంలో రొట్టెలు, పరోటా, జావ రూపంలో వీటి వాడకం బాగా పెరుగుతోంది. మిల్లెట్స్‌, కుకీస్‌లతోనూ ఇతర తీపి పదార్థాలు తయారు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మిల్లెట్‌ మిల్క్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. మిల్లెట్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలి? ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడతాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

రాగులు, సజ్జలు, జొన్నలు లాంటి వివిధ రకాల చిరుధాన్యాలతో విడిగా మిల్లెట్ మిల్క్ ను తయారు చేయవచ్చు. కొన్ని గంటల పాటు మిల్లెట్స్ నానబెట్టి మెత్తగా తయారు చేసుకోవచ్చు. రుచి కోసం ఫ్లేవర్స్ సైతం జోడించుకోవచ్చు. తర్వాత తగినంత నీరు కలుపుకోవచ్చు. చివరగా మిశ్రమాన్ని వడకట్టి మిల్లెట్ పాలు తాగవచ్చు.

ఊదల పాలు
ఊదలతో చేసిన పాలల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని అరికడుతుంది. ఊదల్లో జింక్‌ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును బాగా మెరుగు పరుస్తుంది. గాయాలను త్వరగా మానేలా చేస్తుంది.

సజ్జల పాలు
సజ్జల పాలల్లో ప్రోటీన్‌ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల రిపేరీ, వృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది. ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేసేందుకు, రక్తహీనతను నివారించడానికి అవసరమైన ఐరన్ కంటెంట్ దొరుకుతుంది. రక్త ప్రసరణ బాగుపడుతుంది.

జొన్న పాలు
జొన్నలతో చేసిన పాలల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వాటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. జొన్నలు గ్లూటెన్ రహిత ఆహారం. జొన్న మిల్లెట్ మిల్క్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

వరిగల పాలు
వరిగల మిల్లెట్ పాలల్లో విటమిన్-బీ అధికంగా లభిస్తుంది. ఇందులో నియాసిన్, థయామిన్ అనే కాంపౌండ్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి ఉత్పత్తి చేసి, నరాల పనితీరును బాగుచేస్తాయి. వరిగల పాలల్లో మెగ్నీషియం కూడా తగిన మోతాదులో లభిస్తుంది. ఇది కండరాలు, నరాల ఆరోగ్యానికి మద్దతుగా నిలుస్తుంది.

రాగి పాలు
రాగి పాలల్లో కాల్షియం అధికంగా లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. బోలు ఎముకల వ్యాధిని రాకుండా అడ్డుకుంటుంది. రాగి పాలల్లో యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు కూడా మెండుగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలంగా తయారు చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీర కణాలను కాపాడతాయి.

ఇవీ చదవండి: Eye health: కంటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
Cluster Beans: గోరుచిక్కుడుతో అద్భుత ప్రయోజనాలు.. కండరాల ఎదుగుదలకు చక్కటి ఆహారం
Cashew: జీడిపప్పు ఆహారంలో భాగం చేస్తున్నారా? ఆరోగ్యం మీ సొంతం.. జీడిపప్పు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు