HomeInternationalPakistan: ఇమ్రాన్‌ఖాన్‌ టార్గెట్‌.. పాక్‌ సర్కారు సక్సెస్‌ అయిందా?

Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌ టార్గెట్‌.. పాక్‌ సర్కారు సక్సెస్‌ అయిందా?

Pakistan: పాకిస్తాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ టార్గెట్‌గా సోషల్‌ మీడియా సైట్లను నిషేధించారు. ఈ మేరకు పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని ఆ దేశంలోని చట్టసభలో ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టడం విశేషం. సోషల్ మీడియా సైట్లపై బ్యాన్ విధించాలని సెనెట్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన సెనెటర్ బహ్రమంద్ టాంగీ తీర్మానించారు. ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి వేదికలను నిషేధించాలని ఈమేరకు ఆ తీర్మానంలో విన్నించారు. మార్చి 11తో సెనెటర్‌గా పదవీకాలం ముగిసింది. టాంగీ ఈ తీర్మానాన్ని అప్పట్లో తీసుకొచ్చారు.

యువతరం పెడదోవ పట్టకుండా, వినాశకరమైన ప్రభావాల నుంచి కాపాడేందుకు దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని తీర్మానంలో కోరారు. భాష, మతం ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాన్ని రగిల్చడం, సంస్కృతికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్మీకి, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా సోషల్ మీడియా వేదికలు ఉపయోగించడంపై ఆందోళనలు ఉన్నాయని టాంగీ అప్పట్లో తెలిపాడు.

టార్గెట్ ఇమ్రాన్!
అయితే, ఈ తీర్మానం వెనక టార్గెట్ ఇమ్రాన్ ఖాన్ అని విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ద్వారా ఆయన యువతరాన్ని ప్రేరించారని, అందుకే ఏ వ్యక్తి, పార్టీ గురించి స్పష్టంగా ప్రస్తావించకున్నా, యువతను ఇమ్రాన్ ఖాన్ పార్టీ ”పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)” దూరం చేయాలనే ఉద్దేశం కనిపిస్తోందని ఇమ్రాన్‌ పార్టీ వర్గాలు ఆరోపించాయి.

ఇక పాకిస్తాన్ వ్యాప్తంగా యువతలో అక్కడి సైన్యంపై గౌరవం తగ్గుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కూడా సోషల్ మీడియా ప్రభావం కారణమని సంప్రదాయ పాక్ రాజకీయ నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి: CAA: సీఏఏ అమలుకు నోటిఫికేషన్‌ ఇచ్చిన కేంద్రం.. దీని ప్రకారం ఏం జరుగుతుందంటే..!
Modi on G20: జీ-20 సమావేశాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi speech in Loksabha: కాంగ్రెస్‌పై ప్రజలు నో కాన్ఫిడెన్స్‌ ప్రకటించారు.. ఢిల్లీ, ఏపీలోనూ తిరస్కరించారు: లోక్‌సభలో ప్రధాని మోదీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు