HomeAndhra PradeshYS Jagan Ugadi wishes: తెలుగు వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...

YS Jagan Ugadi wishes: తెలుగు వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

YS Jagan Ugadi wishes: తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ముఖ్యమంత్రి జగన్‌ విషెస్ చెప్పారు.

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. విజయాలు సిద్ధించాలని, సమృద్ధిగా వానలు కురవాలని కోరుకున్నారు. పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షించారు.

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌.. ఉగాది పండుగను కూడా జనంలోనే జరుపుకొంటున్నారు. ఇంతకు ముందే సిద్ధం సభల ద్వారా కేడర్‌లో నూతనోత్తేజం నింపిన ముఖ్యమంత్రి జగన్‌.. ఇప్పుడు నేరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాలతో మమేకమవుతూ జనంలో కలిసిపోతున్నారు. ఈ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌.. మరో రెండు నెలల్లోనే మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తామంటూ దీమాగా ఉన్నారు.

ఇవీ చదవండి: YS Jagan with Pensioners: చంద్రబాబు 40 ఏళ్ల అనుభవంలో ఏనాడైనా ఇంటికే పెన్షన్‌ ఇచ్చాడా?: సీఎం జగన్‌ సూటి ప్రశ్న
YS Jagan in Konakanametla: చంద్రబాబే పెద్ద శాడిస్ట్.. పెన్షన్లు ఆపి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారన్న జగన్
Ambati Rambabu: జగన్‌ దెబ్బకు తట్టుకునే శక్తి టీడీపీకి లేదు: మంత్రి అంబటి రాంబాబు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు