Mass Jathara: పుష్ప 2 (Pushpa 2) సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2 చిత్రానికి సంబంధించి నిన్న టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. లేడీ గెటప్‌లో మాస్ జాతరగా కనిపించారు అల్లు అర్జున్. తన పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ మాస్ గెటప్‌లో కనిపించి అభిమానులను అలరించారు.
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా, రష్మిక మంధన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సోమవారం విడుదల చేసింది చిత్ర బృందం. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా రెండో పార్ట్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.
గంగమ్మ జాతరలో వచ్చే సన్నివేశంతో పుష్ప 2 టీజర్‌ను మేకర్స్ కట్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ లేడీ గెటప్‌లో కనిపించారు. నిమిషం పాటు ఉన్న ఈ టీజర్‌లో ఒక్క డైలాగు కూడా లేకుండా చూసుకున్నారు. అయితే, చివరలో చీరకట్టులో ఊరమాస్ గెటప్‌లో అల్లు అర్జున్ కనిపించి ఆశ్చర్యపరిచారు.
పుష్ప 2 చిత్రంలో ఇంకా ఇతర పాత్రధారుల విషయానికి వస్తే.. ఫహద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ తన దైన శైలిలో రైటింగ్స్ ఉన్నాయని భోగట్టా. ఇక నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రానికి నిర్మాతలుగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: Kiss benefits: ముద్దుతో ఎన్ని ప్రయోజనాలో.. అనుబంధం అల్లుకుపోవాల్సిందే!
Pushpa2TheRuleTeaser: పుష్ప2.. ఆల్ సెట్! రేపే ట్రైలర్ విడుదల!
Allu Arjun: అల్లు అర్జున్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
