ZEE5 New Lineup: భారతీయ OTT మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న వేళ ZEE5 తన కంటెంట్ వ్యూహాన్ని మరింత విస్తరిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా లైవ్ స్పోర్ట్స్, AI ఆధారిత కథలు, యానిమేషన్, కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వరకు విస్తరించిన భారీ మల్టీలాంగ్వేజ్ కంటెంట్ లైనప్‌ను సిద్ధం చేసింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ.. ఇలా ఏడు ప్రధాన భారతీయ భాషల్లో స్థానిక ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కంటెంట్ అందించడమే ఈ వ్యూహంలో ప్రధాన అంశం. పెద్ద సినిమాలు, కొత్త ఒరిజినల్స్‌తో పాటు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందిన ఫ్రాంచైజీలను తిరిగి తీసుకొస్తుండటం విశేషం.
ZEE5 కొత్త లైనప్ ప్రత్యేకత ఏంటి?
OTT అంటే సినిమాలు, సిరీస్‌లు మాత్రమే అనే పద్ధతి నుంచి బయటకు వచ్చి ఒకే వేదికపై విభిన్న రకాల వినోదాన్ని అందించేందుకు ZEE5 ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా Language First విధానానికి ప్రాధాన్యం ఇస్తూ ఆయా ప్రాంతాల సంస్కృతి, ప్రేక్షకుల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథలను రూపొందిస్తోంది. దీనికోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నిర్మాణ సంస్థలు, దర్శకులు, క్రియేటర్లతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంది. మరోవైపు AI ఆధారిత స్టోరీటెల్లింగ్ వంటి కొత్త ఫార్మాట్లపైనా దృష్టిపెట్టడం ఈ లైనప్‌లో ఆసక్తికరమైన అంశం.
తెలుగులో భారీ సినిమాలు.. కొత్త ఒరిజినల్స్
తెలుగు ప్రేక్షకుల కోసం ZEE5 ఈసారి పెద్ద ప్లాన్‌తో వస్తోంది. ‘శ్రీమతి’లో నివేదా థామస్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, ‘Objection My Lord’లో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రేక్షకాదరణ పొందిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కూడా తిరిగి రానుంది. సినిమాల విషయానికొస్తే వెంకటేశ్–అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు సంబంధించిన ప్రాజెక్ట్, NBK111, ‘వృషకర్మ’ వంటి టైటిల్స్‌ను లైనప్‌లో పేర్కొన్నారు. థియేటర్ల తర్వాత ప్రేక్షకులు ఎదురుచూసే పెద్ద సినిమాలను తన ప్లాట్‌ఫామ్‌కు తీసుకురావడం ద్వారా తెలుగు OTT మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ZEE5 భావిస్తోంది. తెలుగు ప్రాజెక్టుల కోసం అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర తదితర సంస్థలతో భాగస్వామ్యాలు లైనప్‌లో కీలకంగా నిలుస్తున్నాయి.
హిందీలో సినిమాలు + సిరీస్‌ల భారీ కాంబినేషన్
హిందీ విభాగంలో కొత్త కథలతో పాటు పాపులర్ ఫ్రాంచైజీలను తిరిగి తీసుకురావడంపై దృష్టిపెట్టారు. క్రికెటర్ వినోద్ కాంబ్లీ జీవితం నుంచి ప్రేరణ పొందినట్లు పేర్కొన్న ‘Kambli’, ‘The Scam Leaked’, ‘Coffee King’ వంటి ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ఆర్. మాధవన్‌తో ‘Jeena Isi Ka Naam Hai 2.0’, ‘Zee Horror Show’తో పాటు మోహిత్ రైనా, అరుణోదయ్ సింగ్ నటించే ‘Rangbaaz S4’, భువన్ అరోరా ‘Janaawar 2’, రాజేష్ తైలాంగ్, షీబా ఛద్దా నటించే ‘Bakaiti S2’ వంటి ఫ్రాంచైజీలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సినిమాల్లో వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మౌనీ రాయ్ నటించే ‘Hai Jawani Toh Ishq Hona Hai’, బాబీ డియోల్–సాన్యా మల్హోత్రా ‘Bandar’, మృణాల్ ఠాకూర్–హుమా ఖురేషీ ‘Pooja Meri Jaan’ సహా పలు ప్రాజెక్టులను లైనప్‌లో చేర్చారు.
తమిళం నుంచి బెంగాలీ వరకు..
తమిళంలో ‘Koose Munisamy Veerappan’, ‘Thadayam’ వంటి కంటెంట్‌తో పాటు ‘Ananthakaalam’, ఇండిపెండెంట్ ర్యాప్ బ్యాటిల్ ఫార్మాట్ ‘Thee Kural’ ఉన్నాయి. ‘Demonte Colony 3’, నయనతార–కవిన్ ప్రాజెక్ట్ సహా సినిమాలను కూడా లైనప్‌లో పేర్కొన్నారు. కన్నడలో ‘Ayyana Mane’ కొత్త సీజన్‌తో పాటు ‘Bitcoin Scam’, ‘Operation Bangara’ వంటి ఒరిజినల్స్ వస్తున్నాయి. రాజ్ బి. శెట్టి, ప్రజ్వల్ దేవరాజ్‌తో కూడిన ‘Karavali’ కూడా సినిమా లైనప్‌లో భాగమైంది. మలయాళంలో ‘A Queen’, ‘Malabar Cup’, ‘Kerala Underground’ వంటి కంటెంట్‌పై దృష్టిపెట్టగా.. మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ కొత్త ఒరిజినల్స్‌తో పాటు పాపులర్ షోల కొత్త సీజన్లను సిద్ధం చేశారు.
ZEE5కు ప్రముఖ స్టూడియోల అండ
ఈ భారీ కంటెంట్ ప్రణాళిక వెనుక దేశంలోని పలు నిర్మాణ సంస్థల భాగస్వామ్యం ఉంది. తెలుగు నుంచి తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ వరకు ప్రాంతీయ స్టూడియోలతో పాటు హిందీలో Jio Studios, Maddock Films, Tips Films, Pen Studios, Reliance Entertainment తదితర సంస్థలతో ప్రాజెక్టులు ఉన్నట్లు ZEE5 ప్రకటించింది. అంటే కేవలం కంటెంట్ కొనుగోలు చేయడం కాకుండా క్రియేటర్లు, స్టూడియోలతో కలిసి దీర్ఘకాలిక కంటెంట్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడం ఈ వ్యూహంలో కీలకంగా కనిపిస్తోంది.
సినిమాలు, సిరీస్‌లే కాదు.. లైవ్ స్పోర్ట్స్ కూడా
ZEE5 తన పరిధిని స్క్రిప్టెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కే పరిమితం చేయడం లేదు. లైవ్ స్పోర్ట్స్‌ను కూడా ప్లాట్‌ఫామ్ వ్యూహంలో కీలక భాగంగా మార్చుతోంది. ఫుట్‌బాల్ నుంచి క్రికెట్, కబడ్డీ వరకు వివిధ స్పోర్ట్స్ ప్రాపర్టీలను ప్రేక్షకులకు అందించే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ కోసం మాత్రమే యాప్ ఓపెన్ చేసే ప్రేక్షకుడిని నిరంతరం ప్లాట్‌ఫామ్‌తో కనెక్ట్ చేయాలన్న వ్యూహం కనిపిస్తోంది.
AI ఆధారిత కథలు.. మరో ఆసక్తికర ప్రయోగం
కొత్త లైనప్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో AI ఆధారిత స్టోరీటెల్లింగ్ ఒకటి. ‘Garud Ek Yodha Ki Gatha’, ‘Vikram Betaal’, ‘Tirupati Balaji’, ‘Ram Anjaneya Yudh’, ‘Ayyappan’ తదితర ప్రాజెక్టులను AI, యానిమేషన్ విభాగంలో తీసుకొస్తోంది. ఇక పిల్లల కోసం ‘Tales of Krishna’, ‘Bandbudh Aur Budbak 2.0’ తదితర కంటెంట్‌ను సిద్ధం చేస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చిన్నారుల వరకు ఒకే ప్లాట్‌ఫామ్‌లో విభిన్న ప్రేక్షకులను చేరుకోవాలన్న ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు.
‘ట్రెండ్స్ ఫాలో కాదు.. క్రియేట్ చేయాలి’
ZEE5 India Business Head తేజ్‌కరన్ సింగ్ బజాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రెండ్స్‌ను అనుసరించడమే కాకుండా కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాలను సృష్టించడంపై సంస్థ దృష్టిపెట్టింది. కంటెంట్‌తో పాటు స్మార్ట్ టెక్నాలజీ, మెరుగైన ప్రొడక్ట్ అనుభవంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ZEE Chief Content Officer రాఘవేంద్ర హున్సూర్ కూడా ఎక్కువ సంఖ్యలో టైటిల్స్ అందించడం కంటే ప్రేక్షకులతో బలంగా కనెక్ట్ అయ్యే కథలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ZEE5 టార్గెట్ ఇదే!
ఈ భారీ లైనప్‌ను పరిశీలిస్తే ZEE5 వ్యూహంలో మూడు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాంతీయ భాషల్లో బలమైన కథలు, భారీ సినిమాలు–పాపులర్ ఫ్రాంచైజీలు, AI–స్పోర్ట్స్–కిడ్స్ వంటి కొత్త విభాగాల్లో విస్తరణ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రేక్షకుల అభిరుచులు భిన్నంగా ఉంటాయి. అందుకే ఒకే రకమైన కంటెంట్‌పై ఆధారపడకుండా ప్రతి భాషకు ప్రత్యేకమైన కథలు, అదే సమయంలో దేశవ్యాప్తంగా ఆకర్షించే భారీ ప్రాజెక్టులను అందించేందుకు ZEE5 ప్రయత్నిస్తోంది.
కొత్త సినిమాలు, ఒరిజినల్స్, ఫ్రాంచైజీలు, స్పోర్ట్స్, AI కంటెంట్‌తో ప్రకటించిన ఈ లైనప్ ఆ వ్యూహంలో కీలక అడుగుగా కనిపిస్తోంది. మరి ఇందులో ఏ సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంటాయో చూడాలి.
Read also: Vadhandhi Season 2 OTT Release: నాలుగేళ్ల తర్వాత వస్తున్న హిట్ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్.. స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్!
OTT Release: డిఫరెంట్ కంటెంట్‌తో ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్! ఎక్కడ చూడాలంటే?
OTT Releases This Week: ఓటీటీల్లో 21 సినిమాలు, సిరీస్‌లు.. ఈ వారం అసలు ఏం చూడాలి? పూర్తి లిస్ట్ ఇదే!
