Wax gourd: మనదేశ వంటకాల్లో చాలా ప్రత్యేకత కలిగినది బూడిద గుమ్మడికాయ. దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే మన ఆరోగ్యాన్ని పదిలంగా పది కాలాలపాటు కాపాడుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ రసంతోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
బూడిద గుమ్మడికాయకు హిందూ సంప్రదాయంలో, ఔషధపరంగానూ చాలా ప్రాధాన్యత ఉంది. బూడిద గుమ్మడి కాయలోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కడుపు ఉబ్బరం, మంటగా ఉన్నప్పుడు బూడిద గుమ్మడి చక్కటి ఔషధంగా పని చేస్తుంది. కాయలోనే కాదు.. చెట్టు అణువణువులో ఆరోగ్యాన్ని సంరక్షించే పోషకాలు దాగి ఉన్నాయి. విత్తనాల్లోనూ, తీగలోనూ అధిక పోషక విలువలుంటాయి. బూడిద గుమ్మడికాయ రసం చేసి తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. బూడిద గుమ్మడికాయ రసం తయారు చేసుకుని తీసుకోవడం వల్ల ఆనేక ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.
కావలసినవి:
* ఒక చిన్న బూడిద గుమ్మడికాయ
* 1-2 టేబుల్ స్పూన్లు తాజా నిమ్మరసం
* పుదీనా ఆకులు కొన్ని
* రుచికి తేనె లేదా పంచదార
తయారుచేసుకునే విధానం ఎలా అంటే..
* బూడిద గుమ్మడికాయపై తొక్క, వాటిలోని విత్తనాలను తొలగించి చిన్న భాగాలుగా కట్ చేయాలి.
* బూడిద గుమ్మడికాయ ముక్కలను బ్లెండర్‌లో వేసి ఓ రౌండ్ తిప్పాలి.
* మెష్ స్ట్రైనర్ లేదా చీజ్ బట్టను ఉపయోగించి, రసాన్ని వడకట్టాలి. గుజ్జును పక్కకు తీసివేయాలి.
* ఆ రసానికి సిట్రస్ కిక్ కోసం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. రుచికి కోసం తేనె లేదా పంచదారను జతకలపొచ్చు.
* ముందు రసాన్ని కొన్ని గంటలు ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. తాగేటప్పుడు కొన్ని పుదీనా ఆకులతో కలిపి తీసుకుంటే టేస్ట్‌తో పాటు ఆరోగ్యం.
హైడ్రేషన్
బూడిద గుమ్మడికాయ రసం హైడ్రేటింగ్ పానీయం. దాహార్తిని తీర్చడానికి, హైడ్రేట్‌గా ఉంచేందుకు ఇది ఒక అద్భుతమైన పరిష్కారం.
తక్కువ క్యాలరీలు
బరువు తగ్గాని భావించేవారు ఈ రసం తీసుకోవాలి. బూడిద గుమ్మడికాయ రసంలో తక్కువ క్యాలరీలు, అధికంగా ఉండే నీటి శాతం బరువు తగ్గించడంలో సాయపడుతుంది.
పోషకాలు
బూడిద గుమ్మడికాయలో విటమిన్లు సీ, బీ1, బీ3 ఉంటాయి. ఖనిజాలు (కాల్షియం, ఫాస్పరస్), యాంటీ ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండడానికి సాయపడతాయి.
డైటరీ ఫైబర్స్
బూడిద గుమ్మడికాయ రసం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది తేలికలాంటి మూత్ర విసర్జన లక్షణాలను కలిగి ఉండి.. విషాన్ని బయటకు పంపడంలో సాయం చేస్తుంది.
శీతలీకరణ ప్రభావం
సంప్రదాయ వైద్యంలో, బూడిద పొట్లకాయ శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలోని వేడిని చల్లబరచడంలో సాయం చేస్తుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ
బూడిద గుమ్మడికాయ హైపోగ్లైసీమిక్ ప్రభావాలను కలిగి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతుంది. నిపుణులు ఈ రసాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలని చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఈ రసంలో ఉండే పోషకాలను శరీరం గ్రహిస్తుంది.
ఇవీ చదవండి: Sitting on Chair: రోజూ ఎక్కువ సమయం కుర్చీలోనే కూర్చుంటున్నారా? శారీరక ఆరోగ్య ప్రమాదాలు!
Early morning Tea: ఉదయాన్నే పరగడుపున టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి ఎంతటి నష్టమో తెలుసా?
Pasupu Kommulu: పసుపు కొమ్ముల ప్రయోజనాలు.. ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తాయో తెలుసా?
