Income Tax: మనం చేసే ప్రతి లావాదేవీలను కూడా ఇన్ కం ట్యాక్స్ శాఖ నిశితంగా పరిశీలిస్తుంది. ఇప్పుడు ఎలాంటి లావాదేవీ అయినా డిజిటల్ రూపంలో జరుగడం ఇందుకు తార్కాణం. ఏ చిన్న తప్పు చేసినా ఇన్ కం ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపుతారు. మీరు కూడా ఈ 5 తప్పులు చేస్తే మాత్రం ఐటీ నోటీసులు అందుకుంటారు.
ప్రస్తుతం డిజిటల్ విప్లవం నడుస్తోంది. చేతిలో క్యాష్ లేకపోయినా బ్యాంకు బ్యాలెన్స్, మొబైల్ ఫోన్ ఉంటే చాలు. డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా డిజిటల్ చెల్లింపుల్లో భాగమే. దొంగల భయం, అనవసర ఖర్చులు తగ్గించుకునేందుకు చాలామంది డిజిటల్ లావాదేవీలకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు.
వినియోగ సమయంలో చాలా సౌలభ్యంగా ఉండటం వల్ల డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి. ఇదేసయంలో నగదు వినియోగం స్థానంలో డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎవరు ఏ మేర డబ్బులు ఖర్చు చేస్తున్నారు? వినియోగదారుల కొనుగోలు శక్తి, ఆదాయం వంటివి పూర్తిగా ప్రభుత్వానికి తెలుస్తున్నాయి. డిజిటల్ విధానాన్ని అనుసరించడం వల్ల ఎంత ప్రయోజనం ఉందో కొన్నిసార్లు రిస్కు కూడా అంతే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సౌకర్యంగా ఉందని ఎలా పడితే అలా డిజిటల్ విధానాన్ని, ఆన్‌లైన్, క్రెడిట్, డెబిట్ కార్డులు వాడితే ఆదాయపు పన్ను శాఖ రూపంలో సమస్యలు వచ్చి పడతాయి. పరిమితికి మించిన చెల్లింపులపై మీ నుంచి ఆదాయపు పన్నుశాఖ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఐటీ పరిమితులు ఏంటో? ఏ ఏ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలో అందరూ తెలుసుకోవాలి.
క్రిడిట్ కార్డు చెల్లింపులు
ప్రతి నెలా ఒకటో తారీఖును జీతం పడగానే ముందుగా గుర్తుకు వచ్చేది క్రెడిట్ కార్డు రుణాలే. నెలంతా క్రెడిట్ కార్డులతో ఖర్చులు చేసిన వారు ముందుగా ఆ రుణం తీర్చాల్సి ఉంటుంది. లేకపోతే తిప్పలు తప్పవు. మీ కార్డు పరిమితి వరకు మీరు ఎంతైనా డబ్బు వినియోగించవచ్చు. అయితే తిరిగి చెల్లించే సమయంలో కొన్ని ఆర్థిక పరిమితులను అందరూ గుర్తు పెట్టుకోవాలి. రూ.1లక్ష దాటి క్రెడిట్ కార్డు బిల్లు సెటిల్ చేస్తే మీకు ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రూ.1లక్ష లోపు మాత్రమే క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్యాంకు డిపాజిట్లు
బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసేటప్పుడు కొన్ని ఆదాయపు పన్ను పరిమితులు పాటించాలి. ముఖ్యంగా ఫిక్సుడు డిపాజిట్లు చేసే సమయంలో రూ.10 లక్షలకు మించిన నగదును డిపాజిట్ చేయకూడదు. రూ.10 లక్షల పరిమితి దాటితే, దానికి సంబంధించిన వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలియపర్చాలి.
రియల్ ఎస్టేట్ ట్రాన్జాక్షన్స్
భూ క్రయ, విక్రయాల సమయంలోనూ ఐటీ నిబంధనలు తప్పక పాటించాలి. రియల్ ఎస్టేట్ లావాదేవీలను ఆదాయపు పన్నుశాఖ నిశితంగా గమనిస్తుంది. భూములు, ఇళ్లు, అపార్టుమెంట్ల కొనుగోలు, అమ్మకాల్లో రూ.30 లక్షలు వరకు నగదు లావాదేవీలు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అంతకుమించిన చెల్లింపులపై ఐటీకి సమాచారం తప్పక ఇవ్వాలి.
మ్యూచువల్ ఫండ్స్, మార్కెట్ పెట్టుబడులు
ఆన్‌లైన్ వ్యాపార లావాదేవీల్లో భాగంగా చాలా మంది మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్‌లలో పెట్టుబడులు పెడుతుంటారు. ఇలాంటి వ్యాపారాలు చేసిన వారు ఏడాదికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆంక్షలు లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చు. రూ.10 లక్షలు పరిమితి దాటిన లావాదేవీలను ఐటీ శాఖ పరిశీలనకు తీసుకునే చాన్స్ ఉంటుంది.
ఐటీ చెల్లింపుదారులు కానివారు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిమితిదాటిన వాటిపై ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. లేనిపక్షంలో ఆదాయపు పన్నుశాఖ తక్షణ చర్యలకు గురికావాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: AP CID on CBN: చంద్రబాబు ఐటీ స్కామ్‌పై రంగంలోకి ఏపీ సీఐడీ
IT Notice to CBN: చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు.. ఇప్పటి వరకు రియాక్షన్ లేదెందుకు? తేలుకుట్టిన దొంగేనా?
CM Jagan Review On GIS: విశాఖ ఐటీ హబ్ కావాలి.. రివ్యూ మీటింగ్‌లో సీఎం జగన్
