HomeLife StyleSugar patients: చక్కెర వ్యాధిగ్రస్తులు ఎలాంటి వ్యాయామాలు చేయాలి?

Sugar patients: చక్కెర వ్యాధిగ్రస్తులు ఎలాంటి వ్యాయామాలు చేయాలి?

Sugar patients: ఈరోజుల్లో చిన్నవయసు వారిలో కూడా చక్కెర వ్యాధి వచ్చేస్తోంది. మనదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా షుగర్‌ వ్యాధిబారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. అయితే, శారీరక శ్రమ అధికంగా లేకపోవడం కూడా షుగర్‌ వ్యాధి రావడానికి కారణంగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.

వైద్యులు వ్యాయామం చేయాలని సలహా ఇస్తున్నారు. షుగర్ వ్యాధి బారిన పడిన వారు ఎలాంటి వ్యాయామాలు చేయాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువ మంది బాధపడుతున్న ఆరోగ్య సమస్య డయాబెటిస్. షుగర్ అని పిలిచే డయాబెటిస్‎కు ప్రధాన కారణం శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు అధిక స్థాయిలో పెరగడం. మనకు సరైన శారీరక శ్రమ లేకపోవడం, ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

తాజాగా తేలిన ఓ అంచనా ప్రకారం ప్రపంచంలో 422 మిలియన్ల జనాభా డయాబెటిస్‌ బారిన పడిందని తేలింది. షుగర్ కారణంగా ప్రతి ఏటా 1.5 మిలియన్ల మంది చనిపోతున్నారట. జీవనశైలి, దురలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమలేకపోవడం వల్ల షుగర్‌ పేషెంట్లు పెరిగిపోతున్నారట. డయాబెటిస్ బారిన పడితే దానిని కంట్రోల్లో ఉంచుకోవడం తప్ప పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు.

చక్కెర వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో లేకపోతే కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. వారు చేసే చిన్నపొరపాట్లు ప్రాణాంతకంగా మారే ప్రమాదాలున్నాయి. మందులు వాడుతున్నా సరే వ్యాయామం చేకపోతే షుగర్‌ను నియంత్రణలో ఉంచలేమని నిపుణులు అంటున్నారు. డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు చెబుతున్నారు.

చక్కెర వ్యాధి బాధితులు కొన్ని వ్యాయామాలతో వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. రోజుకు కనీసం 21 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

ఈతకొట్టడం
స్విమ్మింగ్ శరీరానికి ఉత్తమమైన వ్యాయామమని వైద్యులు చెబుతున్నారు. ఇది మిమ్మల్ని ఫిట్‎గా చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా చాలా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్లను స్విమ్మింగ్ అదుపు చేయడంలో ప్రయోజనకరంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. స్విమ్మింగ్ రక్త ప్రసరణను వేగవంతం చేయడంతోపాటు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. బరువు, రక్తంలో చక్కెర స్థాయిలలో ఎలాంటి హెచ్చుతగ్గులు అనేవి లేకుండా చేస్తుంది.

సైక్లింగ్
సైక్లింగ్ చేయడం చాలా ముఖ్యం. ఇది ఏరోబిక్స్ వ్యాయామం లాంటిది. ఇది గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. అధిక బరువు, రక్తపటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, డయాబెటిస్ రోగులు సైక్లింగ్ చేస్తే ఆరోగ్యానికి ఉత్తమం. సైక్లింగ్ అనేది తేలికపాటి వ్యాయామం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నడక
ప్రస్తుతం చాలా మంది చేయాల్సిన అత్యవసర వ్యాయామాల్లో ఒకటి నడక. ముఖ్యంగా డయాబెటస్ రోగులు రోజుకు కనీసం 20 నిమిషాలు అయినా నడవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వీలైతే ప్రతిరోజు 20 నుంచి 40 నిమిషాలు నడక వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చట. రోజువారి నడక చాలా మేలు కలిగిస్తుంది. మధుమేహం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో నడక ముఖ్యపాత్ర వహిస్తుంది. డయాబెటిస్ బాధితులకు వాకింగ్ దివ్య ఔషధం.

యోగా
డయాబెటిస్ అదుపు చేయడంలో ఉత్తమమైన సాధనం యోగా. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో యోగా చాలా బాగా పని చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతోపాటు ఎముకలను బలంగా తయారు చేస్తుంది. ప్రతి రోజూ అరగంట యోగా చేయడం చేస్తే డయాబెటిస్ సమస్య గణనీయంగా అదుపులో ఉంటుంది.

ఇవీ చదవండి: Blood sugar: రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం ఎలా? కార్బోహైడ్రేట్లను పరిమితం చేస్తే ఉపయోగాలు ఇవీ..
Type 2 Diabetes: టైప్-2 డయాబెటిస్ లక్షణాలు.. ఎలా కంట్రోల్‌ చేయాలంటే..
Type 2 diabetes: టైప్-2 డయాబెటిస్‌ను ముందే గుర్తించగలమా? నిర్ధారణ అయితే ఏం చేయాలి?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు