HomeAndhra PradeshMemantha Siddham: మేమంతా సిద్ధం.. జనంలోకి జననేత.. ఇవాళ్టి షెడ్యూల్‌ ఇదీ

Memantha Siddham: మేమంతా సిద్ధం.. జనంలోకి జననేత.. ఇవాళ్టి షెడ్యూల్‌ ఇదీ

Memantha Siddham: మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బస్సు యాత్ర ఇవాళ్టి నుంచి మొదలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజులపాటు నాన్‌ స్టాప్‌గా జరిగే ఈ యాత్రతో కేడర్‌లో జోష్‌తోపాటు ప్రజల్లో నూతనోత్తేం నింపనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27వ తేదీ నేడు ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుంది.

వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లి లోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటలకు ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. అక్కడ తన తండ్రి, దివంగత మాజీ సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారు.

అనంతరం 1.30 గంటలకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి మీదుగా ప్రయాణిస్తారు.

సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

వైయస్సార్‌ జిల్లా కడపలో అభివృద్ధిని సీఎం జగన్‌ బహిరంగ సభలో వివరిస్తారు. పారిశ్రామిక రంగంలో జిల్లాలో ఇప్పటికే రూ.4,440 కోట్లతో 647 పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. జిందాల్ స్టీల్స్‌ ఏర్పాటు చేస్తున్న భారీ ఉక్కు పరిశ్రమ భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తోంది.

సీఎం జగన్ వచ్చాక రూ.128 కోట్లతో 443 కి.మీ. రోడ్లు వేశారు. ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, ఆస్పత్రులు, పాఠశాలలు అద్భుతంగా నిర్మించారు. పేదింటి పిల్లలు సైతం కార్పొరేట్ స్కూళ్లను తలపించే విద్యాలయాల్లో సగర్వంగా చదువుకుంటున్నారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు రూ.15,247 కోట్లు నగదు బదిలీ జరిగింది.

ఇవీ చదవండి: Bus Yatra: వైయస్‌ జగన్‌ బస్సు యాత్రకు సర్వం సిద్ధం.. రెండు రోజుల షెడ్యూల్‌ ఇదీ..
CM Jagan Ready to Elections: ఎన్నికల సమరానికి సీఎం జగన్‌ సిద్ధం.. 18 నుంచి ప్రచార సమర భేరి!
Raptadu Siddham: రాయలసీమలో జనసముద్రం.. రాప్తాడు సిద్ధం సభలో బిగ్గెస్ట్‌ క్రౌడ్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు