Onion: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది మనందరికీ తెలిసిన సామెత. ఉల్లితోపాటు ఉల్లిపాయ తొక్కతోనూ అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా? ఉల్లిపాయ తొక్కలను చిన్నచూపు చూడకుండా దాని నుంచి ఉపయోగాలు తెలుసుకుని వినియోగించుకోవాలి.
ఉల్లి పాయ తొక్కల వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ యాంటీబయోటిక్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండి వీటిని తినడం ద్వారా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. వీటిలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బీ, సీ, సమృద్ధిగా ఉన్నాయి. కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం చాలా తక్కువ మోతాదులో ఉండి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఇవి తెలియక మనలో చాలా మంది ఉల్లిపాయ తొక్కలను వృధా చేస్తుంటారు. ఉల్లిపాయ తొక్కలు మంచి పోషకాలు అని నిపుణులు అంటున్నారు. ఇవి జుట్టుకు మేలు చేకూరుస్తాయి. కంటివ చూపును మెరుగుపడేలా చేస్తాయి.
ఉల్లిపాయ తొక్కలతో చాయ్
ఉల్లిపాయ తొక్కలను నీటిలో ఓ పావుగంట ఉడకబెట్టాలి. తొక్కలను వడకట్టి కప్పు టీని తయారుచేసుకుని తాగవచ్చు. దీని వల్ల ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఉల్లిపాయ తొక్కతో చేసిన టీ తాగడం వల్ల చర్మం సాఫ్ట్‌గా మారుతుంది. ఊబకాయం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లను పోగొడుతుంది. రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుంది.
చర్మం దురదకు పరిష్కారం
ఉల్లిపాయ తొక్కల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మం, దద్దర్లు, అథ్లెట్స్ ఫుట్‌పై దురదను తగ్గించడంలో దోహదపడతాయి. చర్మంపై ఉల్లిపాయ తొక్క నీటిని అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
సల్ఫర్ ఫుష్కలంగా ఉండే ఉల్లిపాయ తొక్కలను ఉపయోగించి నెరిసిన జుట్టు రంగును నలుపు రంగుకు మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది హెయిర్ ఫాలికల్స్‌కు పోషణ అందించడం ద్వారా బూడిద జుట్టును బంగారు గోధుమ రంగులోకి మారుస్తుంది. జుట్టు పెరుగుదలనూ ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ తొక్కలు నల్లగా కాలేంత వరకు మీడియం మంట మీద వేడి చేసి తొక్కలను మొత్తగా నలపాలి. దీనికి కొద్దిగా కలబంద జల్ లేదా నూనె యాడ్ చేయాలి. ఇలా చేసుకున్న జెల్‌ను నేరుగా హెయిర్ డైలా జుట్టుకు రాసుకుంటే గ్రే హెయిర్‌ను కవర్ చేసుకోవచ్చు.
నాణ్యమైన కంపోస్ట్
కంపోస్టు తయారీకి ఉల్లిపాయ తొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉండి మంచి కంపోస్ట్ తయారు కావడానికి దోహదపడుతుంది.
ఉల్లిపాయ తొక్కలు గొప్ప సువాసన ఏజెంట్లుగానూ పనికి వస్తాయి.. ఉల్లిపాయ తొక్కలను వేయించడం ద్వారా వంటల రుచి, రంగును మెరుగుపడేలా చేయొచ్చు.
సూప్స్ అండ్ గ్రేవీ
స్టాక్, సూప్, గ్రేవీ మరుగుతున్న టైమ్‌లో ఉల్లిపాయ తొక్కలను యాడ్ చేయడం ద్వారా మంచి రుచితోపాటు శక్తివంతమైన రంగును ఏర్పరస్తుంది. గ్రేవీని చిక్కగా తయారు చేస్తుంది. ఉడకబెట్టిన తర్వాత పీల్స్ తొలగించడం ముఖ్యం.
సుఖమైన నిద్ర
ఉల్లిపాయ తొక్కల్లో ఉండే ఎల్ ట్రిప్టోఫాస్ అనే అమైనో ఆమ్లం సహజమైన మత్తు పదార్థంలా పనిచేస్తుంది. ఉల్లిపాయ తొక్క టీ తాగడం వల్ల నరాలు ప్రశాంతత చేకూరుతుంది. మంచి నిద్ర వచ్చేలా చేస్తుంది.
ఇవీ చదవండి: Onion: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.. ఆరోగ్య ప్రయోజనాల్లో మేటిగా ఉల్లిపాయ..
Ganji for Health: రోజుకో గ్లాసు గంజి తాగితే శరీరంలో ఆశ్చర్యపరిచే మార్పులు..!
Peas: వేయించిన శనగలు.. మితంగా తీసుకుంటే రుచి, ఆరోగ్యం.. ప్రోటీన్స్ సమ్మిళితం
