HomeLife StyleSperm: నిద్రలో వీర్యం పోతోందని బెంగ పడుతున్నారా? ఇది మీకోసమే..

Sperm: నిద్రలో వీర్యం పోతోందని బెంగ పడుతున్నారా? ఇది మీకోసమే..

Sperm: నేటి కాలంలో పలువురు యువకులకు రాత్రి పడుకున్నప్పుడు లేదా మూత్రం విసర్జన సమయంలో వీర్యం విడుదల అవుతుంటుంది. ఇలా జరగడం ఏదైనా ఇబ్బందికరమా? అని పలువురికి టెన్షన్ ఉంటుంది. వాస్తవానికి వీర్యం ఎందుకు ఇలా విడుదలవుతుందన్నది అందరూ తెలుసుకోవాల్సిన అంశం. ఇలా జరగడం వల్ల ఏవైనా నష్టాలున్నాయా? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇండియాలో శృంగార సంబంధ విషయాల్లో చాలా మందికి పలు అనుమానాలు ఉంటాయి. అయితే, వీటిని బహిరంగంగా మాట్లాడుకోవడానికి ఎవరూ ముందుకు రాలేరు. స్త్రీలు, పురుషుల్లో ఇలాంటి అనేక అనుమానాలు నివృత్తి చేసేందుకు ఇప్పుడు ఇంటర్నెట్‌, వ్యక్తిగత వైద్యులు సైతం అందుబాటులోకి వచ్చారు.

పురుషుల్లో సాధారణంగా నిద్రలో లేదంటే మూత్ర విసర్జన సమయంలో వీర్యం పోతుంటుంది. ఇది శరీరానికి మంచిదా, కాదా, ఎందుకు ఇలా అవుతుందని పలువురికి అనుమానాలు కలుగుతుంటాయి. వీర్య కణాలు గర్భం వచ్చేలా చేయడానికి ప్రధాన కారణం. అంతేతప్ప వీర్యంతో మరో ప్రయోజనం లేదని పరిశోధనలు కూడా స్పష్టీకరిస్తున్నారు. ముఖ్యంగా సెక్స్‎లో పాల్గొన్నప్పుడు వీర్యం బయటకొస్తుంది. వీర్యం విడుదలైనప్పుడు పురుషులకు భావ ప్రాప్తి కలగడం తెలిసిందే.

ప్రస్తుతం చాలా మంది వృత్తి జీవితంలో తీరిక లేకుండా గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో శృంగారంలో సరిగా పార్టిసిపేట్‌ చేయడం కుదరదు. భాగస్వామికి దూరంగా ఉంటున్నవారు.. యుక్త వయసులో పెళ్లి కానివారు ఎక్కువగా వీర్యం పోతుందని బెంగ పడుతుంటారని అధ్యయనాల్లో వెల్లడైంది. నిజానికి వీర్యం ఏదో రకంగా బయటకు వెళ్లాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. అదేమీ బలానికి సంబంధించినది కాదని సూచిస్తున్నారు. వీర్యం ఎంతపోయినా బాధ పడాల్సిన పనిలేదని వెల్లడిస్తున్నారు.

ఇక నోట్లో ఉమ్మి తయారు అయినట్లే వృషణాల్లో వీర్యం ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటుంది. ఇది హస్త ప్రయోగం, సెక్స్, స్వప్న స్కలనం ఇలా ఏదో ఒక మార్గంలో బయటకు పోవాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు మలమూత్ర విసర్జన సమయంలో కూడా వీర్యం వెళ్లిపోతుందని సూచిస్తున్నారు. ఇలా జరగడం వల్ల మనకు నష్టమేమీ ఉండదు. రక్తం వీర్యంగా మారుతుంది కాబట్టి వీర్య స్కలనం జరిగితే ఆరోగ్యం దెబ్బతింటుందన్నది అపోహ మాత్రమేనని గుర్తించాలి.

హస్త ప్రయోగం అలవాటు ఉన్నవాళ్లకు ఆ పద్ధతి ద్వారా, వివాహం అయిన వారు లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు వీర్యం వెళ్లిపోతుంది. పెళ్లికానివారు, హస్తప్రయోగం అలవాటు లేని వారికి మూత్రం ద్వారా లేదా నిద్రపోతున్న సమయంలో స్వప్న స్కలనం ద్వారా వీర్యం వెళ్లిపోతుంది. ఇది ఒక సహజ ప్రక్రియ అని గుర్తించాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

వీర్యం అనేది ఒక తెల్లటి ద్రవంగా మాత్రమేనని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. వీర్య కణాలు మొత్తం స్కలనంలో కొద్ది భాగాన్ని మాత్రమే కలిగి ఉంటాయని వివరిస్తున్నారు. మిగిలిన పదార్థం ప్రోప్టేట్ గ్రంథి, సెమినల్ వెసికిల్స్ ద్వారా తయారైన వీర్యం. వీర్యం ఉత్పత్తి 24 గంటలపాటు నిరంతరాయంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది వృషణాల్లో నిల్వ ఉంటుంది.

వృషణాల్లో నిల్వ ఉన్న వీర్యం ఎక్కువైపోతే.. ఆటోమెటిక్‎గా బయటకు వచ్చేస్తుందని నిపుణులు వెల్లడించారు. ఈ పరిస్థితిని అనారోగ్యంగా భావించి ఏ సెక్సాలజిస్ట్ లేదా స్పెషలిస్ట్ లను సంప్రదించాల్సిన పని లేదంటున్నారు.

ఇవీ చదవండి: Munaga Kayalu: ఇవి తింటే శృంగార సామర్థ్యం జోరందుకోవాల్సిందే.. ములక్కాడల ప్రత్యేకతలు ఇవీ..
NNN: ఏమిటీ NNN? ఈ నవంబర్‌లో శృంగారానికి దూరంగా ఉండటం ఎవరికి సాధ్యం?
Kiss benefits: ముద్దుతో ఎన్ని ప్రయోజనాలో.. అనుబంధం అల్లుకుపోవాల్సిందే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు