HomeAndhra PradeshState Election Commissioner: ఎలాంటి కార్యక్రమాలకైనా అనుమతి తప్పనిసరిగా పొందాలి

State Election Commissioner: ఎలాంటి కార్యక్రమాలకైనా అనుమతి తప్పనిసరిగా పొందాలి

State Election Commissioner: రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీలు ఎలాంటి కార్యక్రమాలకైనా ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సూచించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన గత మూడు రోజుల్లో ఎం.సి.సి. ఉల్లంఘనలపై 385 ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయని వెల్లడించారు. రూ.3.39 కోట్ల విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్ ను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ నెల 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో అమలవుతున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి సందర్బంగా తీసుకున్న చర్యలను ఆయన మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో హింస రహిత, రీ పోలింగ్ కు అవకాశం లేని ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. దురదృష్ట వశాత్తు ఈ మధ్య కాలంలో గిద్దలూరు, ఆళ్లగడ్డ, మాచర్లలో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయన్నారు. ఇటువంటి హింసాత్మక సంఘటనలకు దారితీసిన కారణాలను, చట్టపరంగా తీసుకున్న చర్యలను వివరించేందుకు జిల్లాల ఎస్పీలు రేపు తమ కార్యాలయానికి వస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరుస్తున్నామని, ఎం.సి.సి. ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మీనా తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు నుండే ఈ ఏడాది జనవరి 1 వ తేదీ నుంచి విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ దాదాపు రూ.176 కోట్లు విలువైన నగదు, విలువైన లోహాలు, నార్కొటిక్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం ఉత్పత్తి, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గత ఏడాది ఇదే రోజులతో పోల్చుకుంటూ మద్యం ఉత్పత్తి, పంపిణీ, నిల్వలను రెగ్యులర్ గా పర్యవేక్షిస్తున్నామన్నారు. గత ఏడాది ఉన్న సాధారణ ఉత్పత్తి, నిల్వలు కంటే ఈ ఏడాది తక్కువ స్థాయిలో ఉన్నట్లు గమనించామన్నారు.

ఆస్తుల వికృతీకరణ (Defacement) కు సంబంధించి 94 కేసులు, వాహనాలు, లౌడ్ స్పీకర్లు దుర్వినియోగంతో పాటు చట్టవిరుద్దమైన సమావేశాలు, ఓటర్లను ప్రేరేపించడానికి సంబంధించి 37 కేసులు నమోదైనట్లు చెప్పారు. రాజకీయ నేతల ఫొటోలు, ప్రకటనలకు సంబంధించి ప్రజా ఆస్తుల పరిధిలో 1.99 లక్షలు, ప్రైవేటు ఆస్తుల పరిధిలోని 1.15 లక్షల వాల్ పెయింటిగ్స్, పోస్టర్లను, బ్యానర్లను, ఇతర వస్తువులను తొలగించామన్నారు.

రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు అవుతోందని, ఎలాంటి కార్యక్రమానికైన అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. సువిధా యాప్ ద్వారా అనుమతులు తీసుకోవచ్చని, ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకూ 392 ధరఖాస్తులు అందాయని, వాటిలో 10 తమ పరిధిలోవి కాగా మిగిలినవి జిల్లా ఎన్నికల అధికారుల పరిధిలో ఉన్నట్లు తెలిపారు. ఎం.సి.సి. ఉల్లంఘనకు సంబందించిన ఫిర్యాదులను సీ విజిల్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న 100 నిముషాల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

దాదాపు 1,173 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నాయని, ఇప్పటి వరకూ 1,307 ఫిర్యాదులు అందాయని, వాటిలో 74 శాతం పరిష్కరించండ జరిగిందన్నారు. సి-విజిల్ పిర్యాధుల్లో 95 శాతం మేర పరిష్కరించే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ యాప్ ను విస్త్రత స్థాయిలో అందరూ వినియోగిస్తూ ఎం.సి.సి. ఉల్లంఘనలను నియంత్రించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, వాలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం, వారితో సాన్నిహిత్యంగా ఉండటం ఎం.సి.సి. నియమాలకు విరుద్ధమన్నారు. ఫిర్యాదులు అందిన 46 మంది వాలంటీర్లను, కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని తెలిపారు. కొందరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు.

ఇవీ చదవండి: AP DCS Exam: ఏపీలో డీఎస్సీ పరీక్ష వాయిదా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఏమన్నారంటే..
Lok sabha elections: లోక్‌ సభ ఎన్నికలకు నగారా.. తొలి దశ నోటిఫికేషన్‌ జారీ
Kalki 2898AD: ప్రభాస్‌ కల్కి వాయిదా? మే 13న ఎన్నికల నేపథ్యంలో కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనా?
CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు