Summer care: ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మార్చి ప్రారంభంలోనే భగభగమంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాల్లో 40 డిగ్రీలను ఉష్ణోగ్రత తాకుతోంది. ఎండకాలం కారణంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సైతం సూచిస్తున్నారు.
పాఠశాల విద్యార్థులకు ఒంటి పూట బడులు కూడా వచ్చేశాయి. మార్చి 15 నుంచి తెలంగాణలో, 18వ తేదీ నుంచి ఏపీలో బడులు ఒంటిపూట నిర్వహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. వేసవి సందర్భంగా తీసుకోవాల్సిన ఆహారాలపై ఈ కథనంలో తెలుసుకుందాం.
తప్పక తీసుకోవాల్సిన పండ్లు..
1. ఎండలు (Summer) ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు (Temperature) అమాంతం పెరుగుతున్నాయి. శరీరం కష్టపడటం ఎక్కువ అవుతోంది.
2. ఎండకాలంలో ప్రత్యేకించి కొన్ని ఆహారాలు కంపల్సరీ తీసుకోవాలి. తద్వారా ఉష్ణ తాపం నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
3. ఎండకాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్స్‌ను అందరూ తప్పనిసరిగా తినాలి. అలా చేసినప్పుడు ఒంట్లో వాటర్ కంటెంట్ పెరిగి బాడీ హీట్ తగ్గిస్తుంది.
4. పుచ్చకాయలు, మామిడి బెర్రీలు, కర్బూజా, పైనాపిల్, పీచెస్ లాంటి ఫ్రూట్స్ ఎండకాలంలో విరివిగా లభ్యమవుతాయి.
5. ఆయా ఫ్రూట్స్ తినడం వల్ల వాటిలోని విటమిన్లు మన బాడీకి అధికంగా లభిస్తాయి. నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తినే ప్రయత్నం చేయాలి.
6. పుచ్చకాయ, పైనాపిల్, పీచెస్ లాంటి ఫలములు మన శరీరాన్ని డీహైడ్రేట్ బారిన పడకుండా చేసి హైడ్రేటింగ్‌గా ఉంచేందుకు ఉపయోగపడతాయి. (oasis)
7. ఇలాంటి ఫ్రూట్స్ తినడం వల్ల వీటిలో కొవ్వు శాతం ఏ మాత్రం ఉండదు. కాబట్టి ఈ ఫ్రూట్స్ తినడం ద్వారా మన బాడీలో నీటి స్థాయిని కాపాడుకుంటూనే వెయిట్ లాస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
8. సత్తు పిండితో చేసే పానీయం ఎండకాలంలో కచ్చితంగా తాగాలని నిపుణులు చెబుతున్నారు.
9. ఇది శరీరాన్ని చల్లబరచడంతో పాటు హైడ్రేట్‌గా ఉంచుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
10. పండ్లు లేదా కూరగాయలతో చేసిన సలాడ్‌ను ప్రతి రోజూ తినాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో బలం పెరగడం, వేడి తగ్గడం జరుగుతుంది.
ఇవీ చదవండి: Summer Precautions: వేసవి వచ్చేస్తోంది.. బీ కేర్‌ఫుల్.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..
Grapes: ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. వేసవిలో తప్పక తినండి
Pomegranate: దానిమ్మ పండు తినడం మిస్ అవకండి.. ఈ వేసవిలో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే..
