HomeAndhra PradeshNo Re poll: జీరో వయలెన్స్‌, నో రీపోల్.. ఇవే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అంశాలు..

No Re poll: జీరో వయలెన్స్‌, నో రీపోల్.. ఇవే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అంశాలు..

No Re poll: రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జీరో వయెలెన్స్, రీపోల్ లేని విధంగా జరపడమే ప్రధాన మంత్రాలు కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. అందుకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లు ప్రణాళికా బద్దంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లతో ఆయన మీడియో కాన్పరెన్సు నిర్వహించి ఎన్నికల సంసిద్దతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

ఆయన మాట్లాడుతూ జీరో వయెలెన్సు, నో రీపోల్ ప్రధాన మంత్రాలుగా వచ్చే ఎన్నికలను నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రెండు మంత్రాల అమల్లో ఎటు వంటి తేడా వచ్చినా అందుకు సంబందిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుదనే విషయాన్ని గమనించాలన్నారు.

ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలేగాని, ఎటు వంటి హింసకు తావు ఉండకూడదన్నారు. ఈ విషయంలో ఎటు వంటి తేడా వచ్చినా సరే భారత ఎన్నికల సంఘం ఉపేక్షింబోదనే విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, బూత్ క్యాప్చరింగ్ కు ఎటు వంటి అవకాశం లేకుండా పటిష్టమై బందోబస్తు ఏర్పాట్లను కూడా చేసుకోవాలని సూచించారు.

త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకి ముందు, తదుపరి జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు మరియు పోలీస్ కమిషనర్లు తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. కంట్రోల్ రూముల ద్వారా నిరంతర పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ముఖ్యమై ఆదేశాలు, రాజకీయ పార్టీల అనధికార ప్రకటనల డిఫేస్మెంట్, 50% పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియ వెబ్ కాస్టింగ్ మరియు ఎన్నికల షెడ్యూలు ప్రకటన తదుపరి రోజూ వారీ పంపాల్సిని నివేదికలు తదితర అంశాలను జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లకు వివరించారు.

జిల్లా ఎన్నికల అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ త్వరలో ఎన్నికల షెడ్యూలు ప్రకటించనున్న నేపథ్యంలో ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీ పక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఓటర్ల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పోస్టల్ ద్వారానే బట్వాడా చేయాలని, ఒక్క పాడేరు ప్రాంతం మినహా మరే ఇతర ప్రాంతాల్లో మాన్యువల్ గా పంపిణీ చేయడానికి వీలులేదనే విషయన్ని గుర్తించాలన్నారు.

సకాలంలో పోస్టల్ ద్వారానే బట్వాడా చేయడాని పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెండింగ్ ఫార్ములను సకాలంలో పరిష్కరించాలని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తదుపరి ఫార్ముల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతంగా అమలు పర్చాలని ఆదేశించారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీలు నగదు, బహుమతులను విరివిగా పంపిణీ చేస్తున్నట్లు పలు వార్తా పత్రికల్లో కథనాలతో పాటు పలు ఫిర్యాదులు కూడా వస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపిన సంబంధిత నివేదికలను తమకు వెంటనే పంపించాలని ఆదేశించారు.

ఎటు వంటి అల్లర్లకు, హింసకు తావు లేకుండా ఎంతో ప్రశాంతా వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ చేస్తున్న ఏర్పాట్లను అదనపు డిజిపి (లా & ఆర్డర్) శంక్బ్రత్ బాగ్చీ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా ఈ వీడియో కార్పరెన్సులో వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలుతో పాటు ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తదుపరి అమచేయనున్న బందోబస్తు కార్యాచరణ ప్రణాళికను వివరించారు.

ఇవీ చదవండి: EC MK Meena: వివాదాలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రాలు: ఎన్నికలకు ఊపందుకున్న ఏర్పాట్లు
CM Jagan Ready to Elections: ఎన్నికల సమరానికి సీఎం జగన్‌ సిద్ధం.. 18 నుంచి ప్రచార సమర భేరి!
SBI Electoral Bonds: ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించిన ఎస్‌బీఐ.. మొత్తం ఎన్ని బాండ్లు అంటే?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు