CM Jagan Ready to Elections: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలు నిర్వహించి కేడర్‌లో జోష్ పెంచిన సీఎం జగన్.. ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో రానున్న తరుణంలో ప్రచార అంకానికి తెర తీయనున్నారు.
16న ఇడుపులపాయకు జగన్
ఈనెల 16వ తేదీన వైయస్సార్ జిల్లా ఇడుపులపాయ (Idupulapaya) వెళ్లి తండ్రి YSR సమాధిని దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడే ఫైనల్ లిస్టు అంటే 175 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఈనెల 18వ తేదీ నుంచి ప్రచార ఘట్టాన్ని మొదలు పెట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్.
మొదట ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిరోజు అంటే ఈనెల 18వ తేదీన ఇచ్ఛాపురం, విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్ పరిధిలో ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. రోజూ రెండు, మూడు బహిరంగ సభలు, రోడ్ షోలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ నేతలతో ఈ విషయాలపై సీఎం జగన్ సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు.
ఈనెల 16న వైయస్సార్ సీపీ (YSRCP) లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటనతో పాటు అదే రోజు మేనిఫెస్టో (YSRCP Manifesto) సైతం విడుదల చేసే అవకాశాలున్నాయి. జగన్ మేనిఫెస్టో కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలూ ఆసక్తి కనబరుస్తున్నాయి. ఎందుకంటే.. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం జనంలో కలిగింది. అందుకే జగన్ మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు. మేనిఫెస్టోను పవిత్రంగా భావించి ఒక ఖురాన్, భగవద్గీత, బైబిల్‌లా చూస్తూ 99 శాతం హామీలు నెరవేర్చామని సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు.
ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను పార్టీ సీనియర్లు తయారు చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ వేదికగా సీఎం జగన్ అభ్యర్థుల వివరాలను నందిగం సురేష్ ద్వారా చదివించిన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లిస్టు ఒకటి అర తప్ప ఇప్పటికే అభ్యర్థుల లిస్టు దాదాపు ఖరారైపోయింది. ఒకటి, రెండు మార్పులతో ఫైనల్ లిస్ట్ వెలువరించే అవకాశాలున్నాయి. ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులర్పించి అధికారికంగా ఫైనల్ లిస్టును ప్రకటిస్తారు.
అసంతృప్తులకు సీఎం జగన్ సర్దుబాట్లు..
సత్తెనపల్లి టికెట్, అక్కడ రాజకీయ అసంతృప్తులపై సీఎంవోకు (AP CMO) పంచాయితీ చేరింది. తాడేపల్లి (Tadepalli) క్యాంపు కార్యాలయానికి ఇవాళ మంత్రి అంబటి రాంబాబు చేరుకున్నారు. అలాగే సీఎంవోకు నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ కూడా వచ్చారు. సత్తెనపల్లి టికెట్ అంబటికి ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.
అలాగే క్యాంపు కార్యాలయానికి కోలా గురువులు, తోట త్రిమూర్తులు, దాడిశెట్టి రాజా,కొడాలి నాని, మార్గాని భరత్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజుతో పాటు పలువురు సీఎంవోకు వచ్చారు. పలు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ల మార్పులపై నేతలతో సీఎం జగన్ చర్చలు జరిపారు. మరోవైపు నగరిలో మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ కొందరు ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయమై మంత్రి రోజా ఇవాళ సీఎంవోకు వచ్చారు.
ఇవీ చదవండి: Justice for Geethanjali: గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
Veligonda Project: ఇది దేవుడి స్క్రిప్టే.. వెలిగొండను జాతికి అంకితం చేయడంపై వైయస్సార్‌ను గుర్తు చేసుకున్న సీఎం జగన్
Ongole CM jagan Meeting: పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
