HomeAndhra PradeshSBI Electoral Bonds: ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించిన ఎస్‌బీఐ.. మొత్తం ఎన్ని బాండ్లు అంటే?

SBI Electoral Bonds: ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించిన ఎస్‌బీఐ.. మొత్తం ఎన్ని బాండ్లు అంటే?

SBI Electoral Bonds: ఎలక్ట్రోరల్‌ బాండ్లపై ఇటీవల వివాదం రాజున్న సంగతి తెలిసిందే. వీటిపై వివరాలు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీం కోర్టు (Supreme Court) చేత ఎస్‌బీఐ (SBI) చీవీట్లు తింది. ఎన్నికల బాండ్ల (Electoral Bonds) కేసులో ఎట్టకేలకు ఆ బాండ్ల వివరాలను ఎస్‌బీఐ.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవాళ సమర్పించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎస్‌బీఐ సమర్పణ చేసింది. ఇవాళ సమ్మతి అఫిడవిట్‌ (compliance affidavit) ఇచ్చింది. ఇందులో పలు వివరాలను వెల్లడించింది.

కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన పెన్‌ డ్రైవ్‌లోని వివరాలను ఎస్‌బీఐ అఫిడవిట్‌లో ప్రస్తావించింది. పెన్‌డ్రైవ్‌లో రెండు పీడీఎఫ్‌ ఫైళ్లు ఉన్నాయని తెలిపింది. వాటికి ప్రొటెక్షణ్ పాస్‌వర్డ్‌లు కూడా ఉన్నాయని ఎస్‌బీఐ తెలిపింది. మరోవైపు ఏప్రిల్‌ 2019 నుంచి ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా మొత్తం 22, 217 ఎన్నికల బాండ్లను జారీ చేశామని ఎస్‌బీఐ తెలిపింది. అంటే ఎన్నికల బాండ్లు చెల్లవని కోర్టు తీర్పు వెలువరించే వరకు ఈ లెక్క వర్తిస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది.

ఎన్నికల బాండ్ల వ్యవహారం మొత్తంలో పొలిటికల్‌ పార్టీలు 22,030 బాండ్లను తీసుకున్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. దాంతోపాటు మిగిలిన 187 తాలుకా బాండ్ల నగదును ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు జమ అయ్యిందని వివరాలు వెల్లడించింది.

ఎలక్ట్రోరల్‌ బాండ్ల స్కీమ్‌ కింద దాతలు ఇష్టపూర్వకంగా విరాళాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో కొనుగోలు చేసి ఆయా పార్టీలకు ఇవ్వాలి. అయితే, 15 రోజుల్లోపు పార్టీలు ఆయా బాండ్లను తీసుకోకపోతే ఆ నగదు ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు చేరుతుంది. కానీ, ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ, రద్దు చేస్తూ ఫిబ్రవరి 15వ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించిన సంగత తెలిసిందే.

ఇవీ చదవండి: BJP 2nd List: బీజేపీ రెండో జాబితా విడుదల.. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి డీకే అరుణ పోటీ
BJP First List: బీజేపీ మొదటి జాబితా రిలీజ్.. లోక్‌సభ అభ్యర్థులు వీరే..
Gudivada Amarnath: ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల బరిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. గెలుపు వరిస్తుందా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు