BJP 2nd List: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలతో రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ (BJP) విడుదల చేసింది. మొత్తంగా 72 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల చేశారు. తెలంగాణ (Telangana) నుంచి రెండో జాబితాలో ఆరుగురు అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. తెలంగాణలో (Telangana BJP) మొదటి జాబితాలో 9 మందికి టికెట్ దక్కింది. మరో రెండు స్థానాలను బీజేపీ అధిష్టానం సస్పెన్స్‌లో ఉంచింది.
తెలంగాణలోని వరంగల్ (Warangal), ఖమ్మం (Khammam) ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు. ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు మరింత కసరత్తు జరగాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు వారు పోటీ చేసే స్థానాలు ఇవీ..
* మెదక్ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు
* ఆదిలాబాద్ – గోడం నగేష్
* పెద్దపల్లి – గోమాస శ్రీనివాస్
* మహబూబ్ నగర్ – డీకే అరుణ (DK Aruna)
* మహబూబాబాద్ – సీతారాం నాయక్
* నల్గొండ – సైదిరెడ్డి
బీజేపీ రెండో జాబితాలో కేంద్రంలోని పలువురు ప్రముఖులు..
* ముంబై నార్త్ – పీయూష్ గోయెల్
* హమీర్ పూర్ : అనురాగ్ ఠాకూర్
* షిమోగ – యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర
* కర్నాల్ – హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
* నాగ్ పూర్ – నితిన్ గడ్కరీ
* బళ్లారి – బి.శ్రీరాములు
* హవేరి – కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై
* ధార్వాడ్ – ప్రహ్లాద్ జోషి
* బీడ్ – పంకజ్ ముండే
ఇప్పటికే 195 మందితో మొదటి లిస్టును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇప్పుడు 72 మందితో సెకండ్ లిస్టును ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ 6 స్థానాలతో పాటు దాద్రానగర్ హవేలీ ఒకటి, ఢిల్లీ రెండు, గుజరాత్ ఏడు స్థానాలు, హరియాణా రాష్ట్రంలో ఆరు స్థానాలు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో రెండు, కర్ణాటకలో ఏకంగా 20 స్థానాలు, మధ్యప్రదేశ్‌లో ఐదు, మహారాష్ట్రలోనూ 20 స్థానాలు, త్రిపురలో ఒకటి, ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాల్లో అభ్యర్థుల వివరాలను బీజేపీ ప్రకటించింది.
ఇవీ చదవండి: BJP First List: బీజేపీ మొదటి జాబితా రిలీజ్.. లోక్‌సభ అభ్యర్థులు వీరే..
Amit Shah at Adilabad: బీజేపీని గెలిపించి కేసీఆర్‌ను గద్దె దించండి : ఆదిలాబాద్ సభలో అమిత్ షా
