Remedies for Rib Pain: సమాజంలో చాలా మంది పక్కటెముకల్లో నొప్పి వస్తూ బాధపడుతుంటారు. తరచూ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. ఈ కారణంగా అంతకుముందెన్నడూ లేని బాధ కలుగుతుంది. ఇలా ఎందుకు కలుగుతుందన్నది చాలా మందిని తొలిచే ప్రశ్న. దానికి కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Remedies for Rib Pain
మనం నడస్తున్నప్పుడు గానీ, ఎక్సర్‌సైజులు చేస్తున్నప్పుడు గానీ, లేదా క్రీడలు ఆడుతున్నప్పడు గానీ పక్కటెముకుల్లో నొప్పి వచ్చి బాధపెడుతూ ఉంటుంది. కొందరికి ఇలా జరుగుతుంటుంది. అకస్మాత్తుగా వచ్చే ఇలాంటి నొప్పితో తల్లడిల్లుతారు. పక్కటెముకలు పట్టేయడం వల్లే ఇలా పెయిన్ వస్తుందని మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం. అసలు ఏందుకు ఈ నొప్పి ఎందుకు వస్తుందన్నది అందరూ తెలుసుకోవాల్సిన అంశం.
ఎందుకు పట్టేస్తుందంటే..
మనం ఏదైనా పనిచేసుకుంటున్నప్పుడు గానీ, ఉదయాన్నే పక్కపై నుంచి లేచినప్పుడు, క్రీడలు ఆడుతున్నప్పుడు, ఎక్సర్‌సైజులు చేస్తున్నప్పుడు పక్కటెముక పట్టేయడం సర్వ సాధారణం. ఇలా బాధపెట్టడం మనలో చాలా మందికి అనుభవమే అయి ఉంటుంది. పక్కటెముకల్లో నొప్పి ప్రమాదకరం ఏమీ కాదని నిపుణులు చెబుతున్నారు.
రోజువారీ సమస్యే అంటున్నారు. కానీ, నొప్పిగా ఉన్నంతసేపు అసౌకర్యం చెప్పనలవి కానిది. ఇంతకీ దీనికి కారణమేంటంటే.. కడుపును చాతీని వేరు చేసే డయాఫ్రం పొర అసంకల్పితంగా సంకోచించడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాఫ్రం పొర ఉన్నట్టుండి సంకోచించడానికి పలు కారణాలు ఉన్నాయట. కాలేయానికి, ప్లీహానికి రక్తం సరఫరా ఎక్కువ కావడం దీనికి ప్రధాన కారణం అని చెబుతున్నారు.
లోపల అవయవాలు డయాఫ్రం పొరను కిందకు లాగడం వల్ల కూడా ఈ తరహా పెయిన్ వస్తుందట. తిన్న వెంటనే శారీరక శ్రమతో కూడిన పని చేయడం లాంటి వాటి వల్ల కూడా డయాఫ్రం పొర సంకోచిస్తుందని నిపుణులు అంటున్నారు. తిన్నతర్వాత ఆహారం జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ రక్తం సరఫరా చేస్తుందన్నది తెలిసిందే. దీని ఫలితంగా డయాఫ్రం పొరకు రక్త సరఫరా తగ్గిపోతుంది. రక్తంలో కాల్షియం, పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోరైట్లు గణనీయంగా తగ్గిపోవడం కూడా ఓ కారణం.
పక్కటెముక పట్టేసిన సమయాల్లో ఏం చేయాలంటే..
పక్కటెముక పట్టేసిన సందర్భాల్లో పనులు అప్పటికప్పుడు ఆపేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు దీన్ని తగ్గించుకోవడం ఎలా? అని అనుమానం కలగవచ్చు. ఇలాంటి సమయాల్లోనే వేగంగా నడవడం, పరిగెత్తడం చేస్తుంటే కాస్త వేగం తగ్గించుకోవాల్సి ఉంటుంది. గట్టిగా గాలి పీల్చుకుంటే కండరాలు వదులై నొప్పి తగ్గే అవకాశం ఉంది. పట్టేసిన డయాఫ్రం సడలే అవకాశం ఉంటుంది. నొప్పి వస్తున్న చోటును గుర్తించి వేలితో కాసేపు అదిమి పడితే కాస్త రిలీఫ్ చేకూరుతుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
పక్కటెముక పట్టేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పరిశీలిస్తే.. భోజనం చేసిన వెంటనే వ్యాయామాలు గట్రా చేయకండి. కష్టమైన పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. కనీసం రెండు గంటలైనా విశ్రాంతి తీసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వీలైనంత వరకు తగ్గించేయాలి.
ఎక్సర్‌సైజులు చేయడానికి ముందు మన శరీరాన్ని రెండు వైపులా బాగా వంగేటట్లు చూసుకోవాలి. ముక్కుతో లాంగ్ శ్వాస తీసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త వహించండి. రోజంతా నీరు తాగుతూ ఉండాలి. కనీసం రోజుకు 8 లీటర్ల మంచినీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కానీ, వ్యాయామం చేసే ముందు ఎక్కువగా నీరు తాగకండి. ఎక్కువగా నీరు తాగిన తర్వాత వ్యాయామం చేస్తే డయాఫ్రం మీద ఒత్తిడి పెరిగి నొప్పి వచ్చే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పక్కటెముకల్లో నొప్పి రాకుండా చూసుకోవచ్చు.
ఇవీ చదవండి: Daily Egg: రోజుకో గుడ్డు.. ఆరోగ్యానికి వెరీ గుడ్డు.. ఉడికించిన గుడ్డులో పోషకాలెన్నో తెలుసా?
Early morning Tea: ఉదయాన్నే పరగడుపున టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి ఎంతటి నష్టమో తెలుసా?
Egg benefits: ఇది మీకు తెలుసా? గుడ్డుతో పాటు పెంకులు తిన్నా ఆరోగ్యమేనట..
Carrot: క్యారెట్ తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే షాక్ అవుతారు..
Eye health: కంటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
