HomeCinemaOoru Peru Bhairavakona: ఓటీటీలోకి బిగ్‌ ట్విస్ట్‌.. అనూహ్యంగా వచ్చిన ఊరు పేరు భైరవకోన

Ooru Peru Bhairavakona: ఓటీటీలోకి బిగ్‌ ట్విస్ట్‌.. అనూహ్యంగా వచ్చిన ఊరు పేరు భైరవకోన

Ooru Peru Bhairavakona: సందీప్‌ కిషన్‌ నటించిన ఊరు పేరు భైరవ కోన చిత్రం అనూహ్యంగా ఓటీటీలోకి వచ్చి ట్విస్ట్‌ ఇచ్చింది. సందీప్ కిష‌న్ (Sundeep Kishan), వ‌ర్ష బొల్ల‌మ్మ (Varsha Bollamma), కావ్య థాప‌ర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 16న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమాకు ఆడియన్స్ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. Ooru Peru Bhairavakona

మంచి విజయాన్ని సాధించిన సోషియో ఫాంట‌సీ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోకి సైలెంటుగా వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా కొన్ని థియేట‌ర్ల‌లో ఆడుతుండగానే మరోవైపు ఓటీటీలోకి వచ్చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వ‌రుస‌గా మూడు రోజుల లాంగ్ వీకెండ్ రావ‌డంతో ఫ్యామిలీ అంతా ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. కానీ ఓటీటీలోకి రావ‌ల్సిన హ‌నుమాన్ సినిమా వాయిదా ప‌డింది. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫాం.. ఊరు పేరు భైరవకోన సినిమాతో బిజీ అయ్యింది.

ఈ సినిమా కథ విష‌యానికొస్తే.. హీరో త‌న స్నేహితుడితో క‌లిసి ఓ భారీ దొంగ‌త‌నం చేసి త‌ప్పించుకునేందుకు ప్రణాళిక వేస్తాడు. ఈ క్ర‌మంలో భైర‌వ‌కోన అనే గ్రామంలోకి పోవాల్సి వస్తుంది. తీరా ఆక్క‌డికి వెళ్లాక వారికి చిత్ర, విచిత్ర ఘ‌ట‌న‌లు చవిచూస్తారు. ఆ ఊరు నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా విఫలమవుతాయి. వారి వ‌ద్ద ఉన్న బ్యాగును ఆ ఊరిలోని ఓ ముఠా దొంగతనం చేసేస్తారు.

ఆ బ్యాగును తిరిగి తీసుకు వ‌చ్చే క్ర‌మంలో సందీప్‌ కిషన్‌కు ఎదురైన వింత అనుభవాలు ఈ చిత్రంలో హైలెట్‌. ఆ హీరో ఆ ఊరికే ఎలా వ‌చ్చాడు అనేది అత్యంత ఆసక్తికరంగా చిత్రీకరించారు. కథనం ఆసక్తికరంగా సాగడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చిన్నారులకు భలే ఆసక్తిగా ఉందని చూస్తున్నారు.

కానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఓటీటీలోకి వదలడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మహా శివ‌రాత్రి (Maha Shivaratri) పర్వదినం రోజు విడుదల చేయడం గమనార్హం. ప్రముఖ ప్ర‌ముఖ‌ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideoIN)లోకి ఈ చిత్రం విడుదలైంది. పండుగపూట ఇంటిల్లిపాదీ సినిమాను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇవీ చదవండి: Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్‌ షో.. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు వైరల్‌
RC16: రామ్‌ చరణ్‌కు జంటగా జాన్వీ కపూర్‌.. అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌!!
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..
Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ ఫొటో గ్యాలరీ
Bramayugam: మమ్ముట్టి మరో మూవీ మంత్రజాలం “భ్రమయుగం”.. తెలుగులో ఎప్పుడంటే…!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు