Army Recruitment Rally: వచ్చే నవంబర్ నెలలో గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసు (ఏఆర్ఓ) పరిధిలోని కృష్ణా నది కుడివైపున గల గుంటూరు జిల్లా మొదలు రాయలసీమ జిల్లాలు కలిపి 13 జిల్లాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వెల్లడించారు.
గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ పునీత్ కూమార్, మేజర్ అమ్మీర్ దీప్ కుమార్‌లతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఏపీలో విశాఖపట్నం, గుంటూరుల్లో రెండు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసులు ఉండగా గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసుకు సంబంధించి నవంబరులో ప్రకాశం, వైయస్సార్ కడప జిల్లాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించాలని ప్రతిపాదించారని తెలిపారు.
ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీల నిర్వహణకు సంబంధించి ఆర్మీ అధికారులకు రెండు జిల్లాల కలెక్టర్లు పూర్తిగా సహాయ సహకారాలను అందించాలని ఆదేశించారు. గుంటూరు ఏఆర్ఓ పరిధిలోని జిల్లాల్లో అర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై గ్రామ స్థాయి వరకూ పెద్దఎత్తున ప్రచారం నిర్వహించి యువత అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం అందించి గ్రామ స్థాయి వరకూ పెద్దఎత్తున ప్రచారం చేయాలని చెప్పారు.
గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసు అధికారి కల్నల్ పునీత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కృష్టానది కుడివైపున గల జిల్లాలు అన్నీగుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసు పరిధిలోకి వస్తాయని వచ్చే నవంబరులో ప్రకాశం,వైయ్సార్ కడప జిల్లాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్టు తెలిపారు.
2024-25 ఆర్మీ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఇప్పటికే ఫిబ్రవరి 13 నుండి మార్చి 22 వరకూ ఆన్లైన్ రిజిష్ట్రేషన్ మరియు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు.ఆర్మీ అధికారిక వెబ్ సైట్ http://www.joinindianarmy.nic.in లో పూర్తి వివరాలు,రిజిస్ట్రేషన్,ధరఖాస్తు చేసుకునే ప్రక్రియ కొనసాగుంతోందని తెలిపారు.
ఈప్రక్రియ పూర్తయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్ష ఉంటుందని చెప్పారు. నవంబరులో ర్యాలీ నిర్వహించేందుకు ప్రతిపాదించిన ప్రకాశం, వైయస్సార్ కడప జిల్లాల్లో తగిన తోడ్పాటును అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు. గుంటూరు ఏఆర్ఓ పరిధిలోని జిల్లాలు అన్నిటిలో గ్రామ స్థాయి వరకూ విస్తృత ప్రచారం గావించి యువత పెద్ద ఎత్తున ఈర్యాలీలో పాల్గొనేలా చూడాలని కోరారు.
ఇవీ చదవండి: Ooru Peru Bhairavakona: ఓటీటీలోకి బిగ్ ట్విస్ట్.. అనూహ్యంగా వచ్చిన ఊరు పేరు భైరవకోన
Andhra Pradesh Election 2024: వైయస్సార్‌సీపీకి 2019 ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా వచ్చిన మెజారిటీ ఇదే..
Input Subsidy to Farmers: రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ రిలీజ్.. అందాల్సిన సాయం అందాల్సిన సమయానికే!
Realme 12+ 5G: ఇండియా మార్కెట్‌లోకి రియల్ మీ 12 5జీ ఫోన్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..
Family Star: ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్.. మృణాల్, విజయ్ దేవరకొండ హిట్ గ్యారెంటీనా?
