Input Subsidy to Farmers: రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ సాయం అందాల్సిన సమయానికే ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీని బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం నిన్న జగన్ మాట్లాడారు. (ysr raithu bharosa)
* ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. Input Subsidy to Farmers
* గతంలో పారదర్శకంగా జరగాల్సిన మంచి జరుగుతుందా అని ఎవరైనా 5 సంవత్సరాల కిందట ప్రశ్నిస్తే అది అయ్యేపని కాదనే సమాధానం వచ్చేది.
* కానీ మొట్టమొదటి సారిగా పరిస్థితులు అటువంటివి మారాయి.
* గ్రామ స్థాయిలో ఆర్బీకే, సచివాలయ వ్యవస్థ రావడం, రైతన్నను చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థ తోడుగా ఉంది.
* పంట సాగు వేసిన ప్రతి ఎకరా ఈ-క్రాప్‌లోకి నమోదు కావడం, ఆ సచివాలయం పరిధిలో ఏ పంట ఎవరు వేశారు, ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏ పంట వేశారనే పూర్తి డేటా అందుబాటులోకి రావడం, వరదల వల్ల గానీ, మరో కారణం వల్ల గానీ ఏ పంట ఎప్పుడు నష్టం జరిగినా అత్యంత పారదర్శకంగా ఏకంగా సచివాలయం పరిధిలోనే లిస్టులన్నీ డిస్ ప్లే చేస్తున్నాం.
* రైతులు చూసుకొనే వెసులుబాటు రావడం, ఇంకా పొరపాట్లు జరిగితే కరెక్షన్ చేసుకొనే వెసులుబాటు రావడం, వచ్చిన తర్వాత ఎక్కడా కరప్షన్ లేకుండా వివక్షకు తావు లేకుండా, లంచాలకు అవకాశం ఇవ్వకుండా, పూర్తి పారదర్శకంగా ప్రతి రైతుకూ అందాల్సిన సాయం, అందాల్సిన సమయంలో అందిస్తున్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల పాలనలోనే జరుగుతోంది.
* రైతు పక్షపాత ప్రభుత్వంగా చాలా సంతోష పడుతున్నా. ఆనందపడుతున్నా.
* మొన్న మిచాంగ్ తుపానులో నష్టపోతే రంగు మారిన ధాన్యం ఇంతకు ముందెన్నడూ కొనలేదు. ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదని మొట్ట మొదటి సారిగా అటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా అడుగులు పడ్డాయి.
* మిచాంగ్ తుపాను వచ్చినప్పుడు 3.25 లక్షల టన్నులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.
* ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉంటోంది. సమయానికే కరెక్టుగా ఇస్తూ తోడుగా నిలబడుతుందన్న భరోసా మొట్టమొదటిసారి కలిగించాం.
* ఈ రెండు విపత్తుల వల్ల.. గతేడాది ఖరీఫ్ లో వర్షా భావం వల్ల, రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన 11.61 లక్షల మంది రైతన్నలకు ఇన్ పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు రూ.1295 కోట్లు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం.
* ఇన్సూరెన్స్ పరంగా చూసుకుంటే మొదటిసారి ఈ 58 నెలల కాలంలో 54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము రూ.7,802 కోట్లు ఇచ్చాం.
* అది కూడా రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోకుండా, ప్రభుత్వమే ఆ కార్యక్రమం చేసి రైతులకు తోడుగా నిలబడింది.
* గత ప్రభుత్వ పాలనతో కంపేర్ చేస్తే 2014-19 మధ్య కాలంలో ఇన్సూరెన్స్ వచ్చింది 30.85 లక్షల మందికి మాత్రమే. అది కూడా 3,411 కోట్లు మాత్రమే. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ప్రతి సంవత్సరం కరువే.
* కేవలం 30 లక్షల మందికి మాత్రమే కేవలం 3411 కోట్లే ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు దేవుడి దయతో మంచి వర్షాలు పడుతున్నాయి. ఈ సంవత్సరమే కొద్దో గొప్పో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
* నాలుగేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించే పరిస్థితి రాలేదు.
* ఏకంగా రూ.7802 కోట్ల ఇన్సూరెన్ష్ ఇచ్చి 54.55 లక్షల మంది రైతులకు తోడుగా నిలబడ్డాం.
* ఈ క్రాప్ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్‌గా వర్తింపజేసేలా అడుగులు మొట్ట మొదటిసారి పడుతున్నాయి.
* బ్యాంకు లోన్ల కోసం రైతు వెళ్లినప్పుడే, క్రాప్ లోను తీసుకున్నప్పుడే, 5 శాతం కటింగ్ తీసుకుని ఆ రైతుకు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తింపజేసే పరిస్థితి ఉండేది. తెలియని రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశమే లేని పరిస్థితి నుంచి ఈరోజు ఎన్ని మార్పులు వచ్చాయో ప్రతి రైతన్న కూడా తెలుసుకోవాలని కోరుతున్నా.
* రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి రైతుకూ రూ.13500 అందించే కార్యక్రమం కూడా ఇంతకు ముందెన్నడూ లేదు.
* గత చంద్రబాబు హయాంలో ఏరోజూ రైతు పంటలు వేసేటప్పుడు సాగు సమయంలో రైతులకు తోడుగా నిలబడాలనే ఆలోచన చేయలేదు.
* 63 శాతం మంది రైతులకు 0.5 హెక్టారు మాత్రమే భూములున్నాయి. 87 శాతం మంది రైతులు ఒక హెక్టారు లోపు మాత్రమే ఉంది.
* ఇటువంటి రైతులందరికీ క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. 80 శాతం పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతోంది. ఇవన్నీ ఇంతకు ముందు ఎప్పుడూ లేవు. ఈ 58 నెలల కాలంలోనే జరుగుతున్నాయి.
* గతేడాది ఖరీఫ్ సీజన్ లో కొంత మేరకు వర్షం తక్కువ నమోదు కావడంతో మొత్తంగా 26 జిల్లాల్లోని 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ధృవీకరించడం జరిగింది.
* ఆ ప్రాంతంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయిన 6.96 లక్షల మంది రైతన్నలకు ఈరోజు ఆ ఇన్ పుట్ సబ్సిడీగా కరువుకు సంబంధించిన నష్టానికి రూ.847 కోట్లు ఇవ్వడం జరుగుతోంది.

* డిసెంబర్ రబీ సీజన్ ప్రారంభంలో మిచాంగ్ తుపాను వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయిన 4.61 లక్షల మంది రైతన్నలకు మరో 442 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీగా విడుదల చేస్తున్నాం.
* రెండూ కలిపి 11.61 లక్షల మంది రైతన్నలకు 1300 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసే కార్యక్రమం జరుగుతోంది.
* జూన్ లో మళ్లీ వీరందరికి ఇన్సూరెన్స్ వస్తుంది. ఎవరికీ ఎక్కడా నష్టపోకూడదని, తక్కువ వర్ష పాతం వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగు కోసం సబ్సిడీ మీద విత్తనాలను కూడా వెంటనే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
* ఉలవలు, అలసంద, మినుము, పెసురు, కంది, రాగి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, జొన్న వంటి తక్కువ కాల పంటల కోసం 30 వేల క్వింటాళ్లు రూ.26 కోట్లతో 1.14 లక్షల మంది రైతులకు సరఫరా చేయగలిగాం.
* మిచాంగ్ తుపాను వల్ల డిసెంబర్ 4న నష్టం జరిగితే డిసెంబర్ 8వ తేదీకల్లా వారికి 31 కోట్లతో 80 శాతం రాయితీతో 49,758 క్వింటాళ్ల విత్తనాలను 71,415 మంది రైతులకు వెంటనే ఆర్బీకేల ద్వారా సప్లయ్ చేశాం.
* రైతన్నలకు ఇది మీ ప్రభుత్వం, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది, తోడుగా ఉంటుందని భరోసా ఇస్తూ అడుగులు వేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం.
* ఈ కార్యక్రమం వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతన్నలకు కొద్దో గొప్పో కాస్త ఊరట రావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అని సీఎం జగన్ తెలిపారు.
ఇవీ చదవండి: Vision Vishakha: రాష్ట్రాభివృద్ధికి విజన్ విశాఖ.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ నేడు కీలక భేటీ
Ongole CM jagan Meeting: పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
Siddham Sabha: జగన్‌కు ప్రజాబలం లేదని నమ్మితే పొత్తులెందుకు బాబూ…? సీఎం జగన్ సూటి ప్రశ్న
Jagan Siddam: మీ జగన్ 57 నెలల పరిపాలనలో 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు..
YS Jagan Rapthadu: జరుగుతున్న మంచి కొనసాగాలంటే మళ్లీ జగన్‌నే గెలిపించుకుందామని చెప్పండి..
