Allu Arjun: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు Allu Arjun. ఆయన సినిమాలే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల బన్నీ ముంబైకి షిఫ్ట్ అవుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఆయన తండ్రి Allu Aravind స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు.
ముంబైకి షిఫ్ట్ అవుతారా?
అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం, బన్నీ ముంబైలో ఎక్కువ సమయం గడపడానికి కారణం కొత్త సినిమా షూటింగ్ మాత్రమే అని చెప్పారు. అక్కడే స్థిరపడే ఉద్దేశం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్ కోసం బన్నీ ముంబైలో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తోందని తెలుస్తోంది.
జూబ్లీహిల్స్‌లో కొత్త ఇల్లు?
ఇదిలా ఉంటే, ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బన్నీ హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ఉన్న తన ఇంటిలో నివసిస్తున్నారు. అయితే నగరంలోనే మరో లగ్జరీ హోమ్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, మెగాస్టార్ Chiranjeevi నివాసానికి సమీపంలోనే జూబ్లీహిల్స్ ప్రాంతంలో బన్నీ కొత్త ఇంటిని నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ ఇంటిని దాదాపు నాలుగు వేల చదరపు అడుగుల గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారని, దీనికోసం సుమారు రూ.80 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాది చివర్లోనే గృహప్రవేశం చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
‘రాకా’ సినిమాతో బిజీ
ఇక సినిమాల విషయానికొస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం Rakka అనే భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు Atlee దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ Deepika Padukone హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
భారీ అంచనాలు
‘పుష్ప’ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ దర్శకత్వం, దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించడం వల్ల ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇవీ చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ కు ఢిల్లీ హైకోర్టు బిగ్ రిలీఫ్.. AI, డీప్‌ఫేక్ వీడియోలపై కీలక ఆదేశాలు
Allu Arjun: ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్న అల్లు అర్జున్? ‘రాకా’ షూటింగ్ కోసం కీలక నిర్ణయం
Allu Arjun: ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్న అల్లు అర్జున్? ‘రాకా’ షూటింగ్ కోసం కీలక నిర్ణయం
