HomeAndhra PradeshVeligonda Project: ఇది దేవుడి స్క్రిప్టే.. వెలిగొండను జాతికి అంకితం చేయడంపై వైయస్సార్‌ను గుర్తు చేసుకున్న...

Veligonda Project: ఇది దేవుడి స్క్రిప్టే.. వెలిగొండను జాతికి అంకితం చేయడంపై వైయస్సార్‌ను గుర్తు చేసుకున్న సీఎం జగన్‌

Veligonda Project: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు జంట టన్నెళ్లను ప్రారంభించడం దేవుడి స్క్రిప్టేనని సీఎం జగన్‌ అన్నారు. (CM YS Jagan) తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి (YSR) వెలిగొండకు శంకుస్థాపన చేస్తే నేడు ఆయన తనయుడైన తాను జాతికి అంకితం చేయడం గొప్ప గర్వకారణమన్నారు. వెలిగొండ టన్నెళ్ల ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడారు. (Veligonda Project)

* ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ల ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితుల మధ్య.. ఆ టన్నెల్‌లో కాస్తంత ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటాను.

* ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను, వారి దాహార్తిని తీరుస్తూ సాగు నీరు కూడా అందించే గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు.

* ఈ పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారు శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్లను కూడా ఒక్కో టన్నెల్ దాదాపు 18 కి.మీ. పైచిలుకు ఉన్న ఈ 2 టన్నెళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం.. ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అన్నది ఇంతకన్నా నిదర్శనం ఏముంది.

* ప్రాజెక్టు (Project) మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, రెండో సొరంగం పనులు కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం.

* ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు కలిపి మొత్తంగా 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ రెండు సొరంగాలు పూర్తయ్యాయి.

* వచ్చే ఖరీఫ్‌లో, జూలై-ఆగస్టులో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకొచ్చి, నల్లమల సాగర్‌లో మళ్లీ నీళ్లు నిండుతున్న సన్నివేశం, ఈ జూలై-ఆగస్టులోనే జరగబోతోంది.
* దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్ పూర్తి చేశాం. 8,500 క్యూసెక్కుల కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయింది.

* శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీరు తీసుకురాగలిగే గొప్ప పరిస్థితి ఈరోజుతో పూర్తయిపోయింది.

* ఈ జూలై-ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో 1200 కోట్లు ఖర్చు చేసి ఎల్ఏ ఆర్అండ్‌ఆర్ పూర్తి చేస్తాం.
* ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం.. ఈ రెండు టన్నెళ్లు పూర్తి కావడం.

* మిగిలినవన్నీ పెద్ద ఏమీ లేవు. రిజర్వాయర్ పూర్తయిపోయింది. నీళ్లు నింపడం కోసం 1200 కోట్లు ఇస్తే పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది.
* నీళ్లు నింపే కార్యక్రమం మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి నీళ్లు నింపుతాం.

* ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా, ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు.. ఇన్ని నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని తెలిసి కూడా.. ఈ టన్నెళ్లు పూర్తి చేయడంలో చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు జరిగాయి.

* రెండు టన్నెళ్లు ఉన్నాయి. ఒక్కోటీ 18.8 కి.మీ. పొడవు ఉంటే, దాదాపు 37.6 కిలోమీటర్ల టన్నెళ్ల లెంత్ అయితే, ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపు 20 కి.మీ. రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు చేస్తూ టన్నెళ్లు పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడ్డాయి.

*2014 నుంచి 2019 వరకు చూస్తే కేవలం 6.6 కి.మీ. మాత్రమే టన్నెళ్ల వర్కులు జరిగాయి. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్లీ ఈరోజు దాదాపు మిగిలిపోయిన 11 కి.మీ. టన్నెళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాం.

* ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడి దయతో ఇంత మంచి చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి ఈ సందర్భంగా మనసు నిండా ప్రేమతో దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. అని సీఎం జగన్‌ తెలిపారు.

ఇవీ చదవండి: Vision Vishakha: రాష్ట్రాభివృద్ధికి విజన్‌ విశాఖ.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్‌ నేడు కీలక భేటీ
Input Subsidy to Farmers: రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రిలీజ్‌.. అందాల్సిన సాయం అందాల్సిన సమయానికే!
Ongole CM jagan Meeting: పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ.. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు
Siddham Sabha: జగన్‌కు ప్రజాబలం లేదని నమ్మితే పొత్తులెందుకు బాబూ…? సీఎం జగన్‌ సూటి ప్రశ్న
Jagan Siddam: మీ జగన్‌ 57 నెలల పరిపాలనలో 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు