Balala kosam: ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ప్రచురించిన బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక అనే పుస్తకాన్ని అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ ప్రవేశిక విశిష్టతపై బాలబాలికల్లో అవగాహన కల్పించేందుకు “దళిత బహుజన రిసోర్స్ సెంటర్” ప్రచురించింది.
దాన్ని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో తిరిగి ప్రచురించారు. ఈ పుస్తకం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీని సీఎస్ అభినందించారు. రాజ్యాంగ ప్రవేశికలో పొందుపర్చిన పలు ముఖ్యాంశాలను ఈ పుస్తకంలో పొందుపర్చారని తెలిపారు.
ముఖ్యంగా మన రాజ్యాంగ ప్రవేశికలో పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచనల్లోను, భావప్రకటనల్లోను, విశ్వాసంలోను, నమ్మకంలోను, ఆరాధనలోను స్వేచ్ఛను, స్థితిగతుల్లోను, ఆవకాశాల్లోను, సమానత్వాన్ని చేకూర్చడానికి, అందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949, నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ లో త్మీర్మానం చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని తమకు తాము సమర్పించుకుంటున్నాం… అని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపర్చడం జరిగిందని సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
ఇంకా ఈపుస్తకంలో మన జాతీయ గీతం జనగన మన,జాతీయ చిహ్నం,జాతీయ పతాకం,మన జాతీయ జంతువు,జాతీయ పక్షి,జాతీయ పుష్పం వంటివి చిత్రాలతో సహా ఉదహరించి ఈపుస్తకంలో పొందుపర్చారని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
కె.ఎస్.లక్ష్మణ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 ఏళ్ళు పూర్తిచేసుకుని 75వ వసంతం లోకి అడుగుడిన సందర్భంగా బాల బాలికల్లో మన రాజ్యాంగ ప్రవేశిక గొప్ప దనాన్ని తెలియజేసి వారిలో రాజ్యాంగం పట్ల అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ఈబాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక అనే పుస్తకాన్ని రచించి ప్రచురించడం జరిగిందని తెలిపారు.
ఇదీ చదవండి: Kerala Schools: స్కూలు విద్యార్థులకు నీళ్ల విరామం.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన!
Scholarship: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకు నెలకు రూ.76 వేల స్కాలర్‌షిప్!
Pradyumna IAS: విద్యతోపాటు క్రీడలపైనా విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలి: ఐఏఎస్ ప్రద్యుమ్న
English Medium exam: ఇంగ్లీషు మీడియంపై నేషనల్ లెవల్ అసెస్‌మెంట్ సర్వే ఎగ్జామ్ రాయనున్న ఏపీ విద్యార్థులు
AP Students in UN: ఎంత ట్రోల్ చేస్తే అంత పైస్థాయికి.. ఐక్యరాజ్య సమితి వేదికపై ఏపీ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు
