Goddess Lakshmi: నిద్రపోయిన సందర్భాల్లో చాలా మందికి కలలు వస్తుంటాయి. పగలంతా బాగా కష్టపడి పని చేసిన తర్వాత రాత్రి భోజనం తిని పడుకుంటే ప్రశాంత నిద్ర వస్తుంది. అలా నిద్రపోతున్న క్రమంలో కలలు వస్తాయి. అయితే, కలలు నిజజీవితంలో జరిగే వాటిని అనుసరించే వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగటి పూట ఏవైతే మనం ఆలోచిస్తామో, వాటికి అనుగుణంగానే కలలు వస్తాయని చెబుతారు. అయితే, ప్రత్యేకించి కలలో కొన్ని వస్తువులు కనిపిస్తే అరిష్టమని, మరికొన్ని వస్తువులు కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు.
కలలో ఇలాంటి సంకేతాలు రావడం త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నట్లు పరిగణించాలట. కలలో నీటితో నిండిన కుండ లేదా పాత్ర కనిపిస్తే మీ ఇంటికి సంపద రాకను తెలియజేస్తున్నట్లుగా భావించాలి. ముఖ్యంగా మీరు మట్టి కుండ లేదా కలశం చూసినట్లయితే, ఈ కల అద్భుతమైనదిగా భావించాలట. ఎందుకంటే ఈ కల భూమి ప్రయోజనాలు, అపారమైన సంపదను పొందటానికి సంకేతంగా చెబుతారు.
ప్రత్యేకంగా కొన్ని వస్తువులు కలలో కనిపించడం వల్ల అదృష్టదేవత ఇంటి తలుపు తడుతుందని చెబుతున్నారు. కలల్లో కమలం, ఏనుగు, గుడి గంట, కలశం, కాడ ఇలాంటి వస్తువులు కనిపించడం వల్ల మీ ఇంట్లోకి లక్షీ అనుగ్రహం వచ్చి చేరుతుందని చెబుతున్నారు. మీపై లక్ష్మీదేవి కరుణిస్తున్నట్లుగా అనుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో పడుకొని నిద్రపోతున్న వేళ.. కలలో గంటలు మోగించడం కొన్ని శుభవార్తలను స్వీకరించడానికి నాందిగా చెబుతారు.
నిద్రపోతున్న సమయంలో లక్ష్మీదేవిని (Goddess Lakshmi) చూస్తే.. త్వరలో మీ జీవితం మారబోతోందని అర్థం. సంక్షోభాలన్నీ తొలగిపోయి ఆర్థిక వృద్ధి కలుగుతుంది. డబ్బు పొందడానికి ఇవి సంకేతాలుగా భావించాలి. ఒకవేళ కలలో తామరపూవును చూసినా కూడా జీవితంలో సంపద పెరుగుతోందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి తామర పువ్వులో నివాసం ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఏనుగును కలలో చూసినా సంపద, శ్రేయస్సు లభిస్తాయట. రాజయోగం పట్టబోతోందని అర్థం చేసుకోవాలి.
లక్ష్మీదేవి త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు సతీమణి. పార్వతి, సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణిస్తారు. మనతదేశంలో దీపావళి పండుగ సందర్భంగా హిందువులు లక్ష్మీదేవిని ప్రముఖంగా పూజిస్తుంటారు. లక్ష్మిదేవి చీర కట్టుకొని, అభరణాలను ధరించి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. లక్ష్మిదేవి నాలుగు చేతులతో ఉంటుంది. రెండు చేతులతో పుష్పాలను పట్టుకొని, రెండు చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ ఉంటుంది.
ఈమె తామర పువ్వు మీద కూర్చుని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది. ఈమెకు అనేక అవతారాలు ఉన్నాయి. విష్ణు దేవేరి అయిన లక్ష్మీ.. విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా, ఆయనతో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా, కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామి భార్య పద్మావతిగా అవతరాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది. లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు. ఏటా శ్రావణమాసం రెండో శుక్రవారం, వరలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మిదేవి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు.
Read Also : Daily Puja: పూజ సమయంలో ఇలాంటి పద్ధతులు పాటిస్తే సకల శుభాలు..