HomeNationalKerala Schools: స్కూలు విద్యార్థులకు నీళ్ల విరామం.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన!

Kerala Schools: స్కూలు విద్యార్థులకు నీళ్ల విరామం.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన!

Kerala Schools: దేశంలోనే అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న కేరళ ప్రభుత్వం మరో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విరామం అన్ని చోట్లా జరిగేదే. అయితే, కేరళ రాష్ట్రంలో విద్యార్థులకు మంచినీరు తాగేందుకు కూడా విరామం ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసిన నేపథ్యంలో విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు, వారు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోనుంది కేరళ ప్రభుత్వం. Kerala Schools

దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చినట్లుగా వాటర్‌ బ్రేక్‌ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురవకుండా ఉండడానికి, తగినంత నీరు తాగేలా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాలల్లో “వాటర్-బెల్” విధానానం అమలుకు చర్యలు తీసుకుంటోంది.

2019లో దేశంలో మొదటిసారి ఈ విధానాన్ని కేరళలోని కొన్ని స్కూళ్లలో ప్రారంభించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్యాలయం తెలిపింది. తర్వాత ఈ విధానాన్ని కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం అమల్లోకి తెచ్చాయని తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకొని గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో అమలు చేస్తోంది.

ఇందులోభాగంగా పాఠశాలల్లో ఉదయం 10.30, మధ్యాహ్నం 2.30 గంటలకు 5 నిమిషాల పాటు విద్యార్థులకు నీరు తాగడానికి విరామం ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది పిల్లల్లో డీహైడ్రేషన్, ఇతర అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుందంటున్నారు.

కేరళ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిర్వహణ అథారిటీ (కేఎస్‌డీఎంఏ) కన్నూరు, కొట్టాయం, కొయ్‌కోడ్‌, అలప్పుళ జిల్లాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలను సూచిస్తూ హెచ్చరిక జారీ చేసింది. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు చేసింది.

ఇవీ చదవండి: Tim Chen: రూమ్‌ రెంట్‌ నెలకు రూ.1,74,358.. విమానం ఖర్చు రూ.99,631.. చదువుకోసం ఈ కుర్రాడు ఏం చేశాడంటే..!
American Education: అందుబాటులో విదేశీ విద్య.. అమెరికా చదువులపై సందేహాలకు సమాధానాలు
Early Childhood Education: చిన్నారుల విద్యపై యూనిసెఫ్‌ రూపొందించిన ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభం
Tableaux Wins Third Prize: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి.. ఆకట్టుకున్న డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌
Pradyumna IAS: విద్యతోపాటు క్రీడలపైనా విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలి: ఐఏఎస్‌ ప్రద్యుమ్న

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు